ప్రస్తుత సమయంలో కేవలం హైపర్ ఆది స్కిట్ కోసమే ఇక ఎంతో మంది ప్రేక్షకులు జబర్దస్త చూస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం ఈటీవీ లో ప్రసారమయ్యే అన్ని కార్యక్రమాలలో కూడా హైపర్ ఆది సందడి చేస్తూ ఉన్నాడూ. అంతే కాదు ఇటీవలి కాలంలో ప్రతి షో లో ఏదో ఒక హీరో గెటప్ లో రావడం ప్రేక్షకులను అలరించడం లాంటివి చేస్తూ ఉన్నాడు. ఈటీవీ లో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షో ఢీ లో టీమ్ లీడర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఢీ షోలో కూడా తనదైన రీతిలో పంచులతో కామెడీ పంచుతూనే ఉన్నాడు.
కాగా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన హైపర్ ఆది ఈటీవీ ఢీ షో లో భాగంగా భీమ్లా నాయక గెటప్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఎర్ర చొక్కా వేసుకుని గళ్ళ లుంగీ కట్టుకుని భీమ్లా నాయక్ పాట బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుండగా.. ఎంతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆటిట్యూడ్ కాఫీ చేస్తున్నట్లుగా కొన్ని డైలాగులు కూడా చెప్పాడు హైపర్ ఆది. అయితే ఇలా హైపర్ ఆది భీమానాయక్ గెటప్లో కనిపించడం తో అభిమానులు అందరూ కూడా ఫుల్ హ్యాపీ అవుతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు హైపర్ ఆది వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. అలాంటి వీరాభిమాని భీమ్లా నాయక్ గెటప్లో కనిపించడం తో ఇక పవన్ అభిమానులు కూడా హ్యాపీ అవుతున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి