కమెడియన్ అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అలీతో సరదాగా' షోకి సీనియర్ హీరోలు,సీనియర్ హీరోయిన్లు, సీనియర్ దర్శకులు వచ్చి అప్పట్లో జరిగిన ఆసక్తికరమైన విశేషాలను, షూటింగ్ విశేషాలను మనకి తెలియజేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా తాజాగా ఎపిసోడ్ కు సీనియర్ హీరోయిన్ శుభ శ్రీ గెస్ట్ గా వచ్చిందట.. ఆమె ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాలాశ్రీ చెల్లెలు అన్న విషయం తెలిసిందే.అయితే శుభశ్రీ.. మాలాశ్రీ లా సక్సెస్ అవ్వలేదు కానీ గ్లామర్ పాత్రలు మాత్రం చేస్తూ చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించేది.

లేదు అంటే పెద్ద సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గానో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో కనిపించేదట..అయితే ఈమె గ్లామర్ తో మాత్రం అప్పట్లో కుర్రకారుని ఓ ఊపు ఊపేసిందనే చెప్పాలి. నిజానికి శుభశ్రీ అసలు పేరు భారతి పాండే. కానీ ఆమె పోషించిన శుభశ్రీ పాత్ర ద్వారా పాపులర్ అవ్వడంతో.. అదే అసలు పేరయిపోయిందట.. అయితే గతంలో ఈమెకి కమెడియన్ అలీకి పెళ్ళైనట్టు ఓ మ్యాగ్జైన్ లో రావడం పెద్ద సంచలనమైందని తెలుస్తుంది.. విషయంలోకి వెళితే..

 

శుభశ్రీ, అలీ హీరో హీరోయిన్లుగా 'అల్లరి పెళ్ళికొడుకు' అనే సినిమాలో నటించారట.. ఈ సినిమాలో వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. కానీ సినిమా షూటింగ్‌ దశలో ఉండగానే ఆ పెళ్ళి ఫోటో బయటకు వచ్చిందట.అది కూడా ఓ మ్యాగజైన్‌ లో వీళ్ళకి పెళ్ళైపోయింది అంటూ కథనం కూడా రావడం.. ఆ మ్యాగ్జైన్ ను అలీ మామగారు కొనడం ఆ ఫోటో చూసి.. అలీ భార్య జుబేదాకి చూపించడం జరిగిందట. ఇందుకు అలీ భార్య కూడా పెద్దగా షాక్ అవ్వడం.. ఇష్యు పెద్దది అవ్వడం కూడా జరిగిందట.

 

ఈ విషయాన్ని అలీ కూడా వివరించారు. అంతే దానికి శుభశ్రీ పడీ పడీ నవ్వింది. ఇక శుభశ్రీ తెలుగులో 15 సినిమాల్లో నటించారని తెలుస్తుంది. 'పెదరాయుడు' 'పెద్దన్నయ్య' 'పోకిరి రాజా' వంటి పెద్ద సినిమాల్లో ఈమె నటించింది. 'అందరూ అందరే' అనేది ఈమె మొదటి చిత్రమట.

మరింత సమాచారం తెలుసుకోండి: