నేచురల్ స్టార్ నాని రెండు సినిమాలతో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించబోతున్నారు. కొత్త దర్శకుడి తో ఆయన చేస్తున్న దసరా సినిమా ఇటీవలే మొదలు కాగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. అంతకు ముందు అంటే సుందరానికి సినిమాను వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో విడుదల చేయడానికి రెడీ చేస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది.  మలయాళ బ్యూటీ నజ్రియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె పాత్ర హైలెట్ గా ఉండబోతుందని అంటున్నారు.

తెలుగులో ఆమె నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.  ఆమెకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. డబ్బింగ్ సినిమాల ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమె తెలుగులో నటించాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉండగా అది ఇప్పటికీ సాధ్యం అయింది. విభిన్నమైన కథ కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో నాని సరికొత్త మేకవర్లో పంచెకట్టులో కనిపించబోతున్నడం విశేషం.  రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే లుక్ తో పాటు ఈ సినిమా కు సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేసి చిత్రంపై అంచనాలు పెంచింది.
ఇకపోతే నాని గత చిత్రాలకు పూర్తి భిన్నంగా రూపొందుతున్న సినిమా కావడంతో ఈ సినిమాను పలు భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు తెలుగు తో పాటు తమిళ మలయాళ భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కన్నడ హిందీ భాషలలో మాత్రం ఈ చిత్రాన్ని విడుదల చేయకపోవడంపై కారణం ఏమిటా అని ఆరా తీస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అందరూ హీరోలు పాన్ ఇండియా సినిమా లు చేస్త్ మాత్రం ఆ విధంగా చేయకపోవడం ఆయన అభిమానులను నిరాశ పరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: