మిల్కీ బ్యూటీ తమన్నా గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రభాస్ , మహేష్ బాబు,  జూనియర్ ఎన్టీఆర్,  రామ్ చరణ్,  పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.  ఇది ఇలా ఉంటే తమన్నా నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో తమన్నా చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది.  ఇది ఇలా ఉంటే టాలీవుడ్ యంగ్ హీరోల సరసన నటించి తన అందచందాలను ఒలకబోసిన తమన్నా ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.  తమన్నా ప్రస్తుతం వెంకటేష్,  చిరంజీవి వంటి సీనియర్ స్టార్ హీరోల సరసన నటిస్తోంది.  ఇలా ఒకప్పుడు యంగ్ స్టార్ హీరోల సరసన నటించిన తమన్నా  ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోల సరసన నటిస్తూ అలరిస్తోంది.

  కేవలం సినిమాలో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ లతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది.  మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటి వరకు  అల్లుడు శీను, స్పీడున్నోడు, జై లవకుశ,  కే జి ఎఫ్ చాప్టర్ 1, గని సినిమాలలో స్పెషల్ సాంగ్ లో నటించింది.  ఇలా సినిమాలలో తన అందచందాలతో ఎంతో మంది ప్రేక్షకులను కట్టిపడేసిన తమన్నా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.  ఇప్పటి వరకు తమన్నా లెవెన్త్ హవర్ , నవంబర్ స్టోరీస్ అనే రెండు వెబ్ సిరీస్ లలో నటించింది.  ఇది మాత్రమే కాకుండా మాస్టర్ చెఫ్ అనే కార్యక్రమానికి కూడా తమన్నా హోస్ట్ గా వ్యవహరించింది.  ఇలా కాలానికి కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: