ఘాడంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్న ఓ యంగ్ హీరో, హీరోయిన్ లు ఇపుడు విడిపోబోతున్నట్లు తెలుస్తోంది. ఇది అందరికీ తెలిసిన కథే అయినా అధికారికంగా ఒప్పుకోకపోవడంతో ఈ విషయం పై పూర్తి క్లారిటీ బయటకు రాలేదు. ఆరడగుల అందగాడు అయిన ఒక యువ హీరో మెరుపు తీగ లాంటి ఒక హీరోయిన్ ని మనసారా ప్రేమించాడు, ఆమె కూడా మనసిచ్చింది. వీరి మధ్య ప్రేమాయణం పై వార్తలు వెల్లువెత్తాయి. అంతా ఓకే ఇంట్లో చెప్పి త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు అన్న ప్రచారం కూడా జరిగింది. అంతా నిజమే అనుకున్నారు. వీరి పెళ్లికి లైన్ క్లియర్ అయ్యిందని అనుకున్నారు.

అయితే ఆ హీరోయిన్ అయితే అలా ఏమి లేదు మేం జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ప్లేటు ఫిరాయించింది అది వేరే విషయం. కానీ సీక్రెట్ గా చెట్టా పట్టాలేసుకుని తిరిగేవాళ్లు. అయితే  ఆ హీరోకి ఇంతలో ఇంట్లో వారి నుండి పెళ్లికి వ్యతిరేకంగా ఒత్తిడి పెరగడం ఇటు కెరియర్ పరంగా కూడా డల్ అవడంతో తన ప్రేమను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడటం తో పెళ్ళి విషయం ఇప్పట్లో వద్దని ఆ హీరోయిన్ కి నచ్చ చెప్పి కెరియర్ పై ఫుల్ గా ఫోకస్ పెట్టారు. అనుకున్న విధంగానే కెరియర్ గాడిన పడింది. భారీ ఆఫర్ లు కూడా వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే ఇంతలో ఆ హీరోయిన్ తనకి మద్య విభేదాలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారట.

అయితే ఆ హీరోకి మాత్రం ఆమెను మరచిపోలేక బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరో హీరోయిన్లు ఎవరు అనేది తెలియాలంటే వారిద్దరిలో ఎవరో ఒకరు ఈ విషయం గురించి పబ్లిక్ చెబితే కానీ తెలిసే అవకాశం లేదు. ప్రస్తుతానికి అయితే వీరిద్దరి పెళ్లి ఆగిపోయింది. మరి త్వరలో వీరిద్దరి మనసులు మరి కలుస్తారా ? లేదా ఇంత వరకు కలిసి ఉంది చాలు అనుకుని ఆగిపోతారా అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: