మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా విడుదలై ప్రేక్షకులందరినీ ఎంతగానో నిరాశపరిచింది. ఈ సినిమా కచ్చితంగా భారీ నష్టాల పాలు అవ్వడం ఖాయమని మెగా అభిమానులు సైతం చెబుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు తొలి ఆట నుంచే బ్యాడ్ టాక్ రావడం మొదలయ్యింది. ఆ విధంగా చిరంజీవి ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత ఫ్లాప్ అందుకున్నాడు.  అయితే ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అన్న విషయం చిత్ర యూనిట్ కి ముందే తెలిసినట్టుంది.

అందుకే చిరంజీవి తో సహా ఎవరు కూడా ఈ చిత్రంపై పెద్దగా అంచనాలు పెట్టుకున్నట్లు లేదు అన్నట్లు వారి వ్యవహార శైలి కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఫ్లాపులు డిజాస్టర్ కొత్తేమీ కాదు. అంతకుముందు ఆయన హీరోగా చేసిన చాలా చిత్రాలు భారీ డిజాస్టర్ గా మిగిలాయి. కెెరియర్లో ఎన్నో అంచనాలు పెట్టుకున్న చిత్రాలు నిరాశ పరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇటీవల కాలంలో ఫ్లాప్ అయిన సినిమాలు ఎక్కువగా లేవు. అలా ఆచార్య సినిమా చిరంజీవి అంచనాలను తలకిందులు చేయగా ఈ సినిమాలో సైతం చిరంజీవి కనిపించిన తీరు ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు.

ప్రతి ఫ్రేమ్ లో ఆయన ఎంతో డల్ గా కనిపించారు. మెగా అభిమానులకు సైతం ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.మంచి నటన ఉన్నా కూడా డాన్సులు చూపించినా కూడా అసలు ఉత్సాహమే కనిపించలేదు అన్నట్లుగా తెలుస్తుంది అని చెబుతున్నారు. కొరటాల శివ కు చిరు పూర్తిగా సరెండర్ అయ్యాడు అని అంటున్నారు. ఈ సినిమా లో అయినా హీరో మామూలుగా కూల్ గా కనిపిస్తారు. ఈ సినిమాలో తన స్టైల్ ను కాదని యాక్టింగ్ చేయించడంతో చిరంజీవి అభిమానులను ఏమాత్రం ఆకట్టుకోలేక పోతున్నాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఈ చిత్రం చేసి ఉంటే ఒక భిన్నమైన సినిమా అయి ఉండేది కానీ అవన్నీ మిస్ అవడంతో ప్రేక్షకులకు ఏమాత్రం రుచించడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: