కోలీవుడ్ ఇండస్ట్రీ క్రేజీ హీరోల్లో ఒకరు అయిన శివ కార్తికేయన్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయవంతమైన సినిమా లతో శివ కార్తికేయన్ తమిళ నాట మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.  తమిళ నాట హీరో గా తనకంటూ  మంచి క్రేజ్ ను సంపాదించుకున్న శివ కార్తికేయన్ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన డాక్టర్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అదిరిపోయే కలెక్షన్ లను కూడా డాక్టర్  మూవీ ద్వారా సాధించాడు.  

డాక్టర్ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న శివ కార్తికేయ తాజాగా డాన్  సినిమాలో హీరోగా నటించాడు.  ఈ సినిమా తెలుగు తో పాటు తమిళం లో కూడా మే 13 వ తేదిన విడుదల కాబోతుంది.  ఇలా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం లోని సభ్యులు పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో ,  అలాగే సోషల్ మీడియా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ  ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.  అందులో భాగంగా శివ కార్తికేయన్ కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు అందులో భాగంగా మల్టీస్టారర్ సినిమాల గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.  

తాజా ఇంటర్వ్యూలో శివ కార్తికేయన్ మాట్లాడుతూ...  తమిళంలో లేదా తెలుగులో నేను మల్టీస్టారర్ సినిమాల్లో నటించడానికి రెడీ గానే ఉన్నాను.  కాక పోతే పాత్రలలో సమ ప్రాధాన్యత ఉండాలి అని హీరో శివ కార్తికేయన్ తాజా ఇంటర్వ్యూలో తెలియజేశాడు.  మంచి కథ , పాత్రల మధ్య సమాన ప్రాధాన్యత ఉన్నట్లు అయితే మల్టీస్టారర్ సినిమాల్లో నటించడానికి రెడీ అని తాజా ఇంటర్వ్యూ శివ కార్తికేయన్ వెల్లడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: