సినిమా చిత్రీకరణ అంటే అంత సామాన్యమైన విషయం ఏమీ కాదు. అందులోనూ పెరిగిన సాంకేతిక పరంగా ప్రేక్షకుల నాలెడ్జ్ పరంగా వారి అభిరుచుల పరంగా సినిమాలు చేయడం అంత సులువైన పని కాదు. మంచి
సినిమా చేయాలనే తాపత్రయంతో చాలామంది మేకర్స్ అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ చేస్తున్నారు. అలాంటి ప్రదేశాల్లో షూటింగ్ చేయడం ఎంత కష్టమో ఇంకా ఎంత ప్రమాదకరమో చూసే వారికి ఎవరికీ తెలవదు అని చెప్పాలి.
అలా ఎంతో కష్టం తరమైన పరిస్థితుల మధ్య రౌడీ స్టార్
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాకు పని చేస్తున్నారు వందల మంది.
శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న
సినిమా షూటింగ్ కోసం చిత్రబృందం చాలా రోజుల క్రితమే కశ్మీర్ కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఎన్నో క్లిష్టతరమైన పరిస్థితుల నడుమ షూటింగు చేస్తున్నారట చిత్రబృందం. కశ్మీర్లో ఎప్పుడు చలి ఎక్కువగా ఉండే ప్రదేశం. అలాంటి ప్రదేశం లో షూటింగ్ చేయడం అంటే అంత సామాన్యమైన విషయం ఏమీ కాదు. చిత్ర యూనిట్ కు సరైన సౌకర్యాలు కూడా లేని సందర్భాలు ఉన్నాయి.
అయినా కూడా
సినిమా కోసం ఎంతో ఓర్చుకుని ఇంకెంతో కష్టపడి వారు షూటింగ్ లు చేస్తూ ఉండడం విశేషం.
సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ కాశ్మీర్లో జరుపుకుంటూ ఉండగా ఆ తర్వాత
జూన్ 5వ తేదీ నుంచి హైదరాబాద్లో షూటింగ్ జరుపుకోనుంది. మరి ఈ
సినిమా అవుట్ పుట్ బాగా వస్తుందని చిత్ర యూనిట్ చెబుతున్న నేపథ్యంలో ఏ స్థాయిలో ఈ
సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ఇకపోతే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న ఈ
సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ
సినిమా లో
అనన్య పాండే హీరో గా నటిస్తుంది.