టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు.  కొన్ని రోజుల క్రితం విడుదలైన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ తన క్రేజ్ ను పాన్ ఇండియా రేంజ్ లో పెంచుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో హీరో గా నటించాడు.  

ఇది ఇలా ఉంటే మరి కొద్ది రోజుల్లో ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్నాడు.  ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ ఒక మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో టాలీవుడ్ స్టార్ హీరోల  జాబితా లో  జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. అసలు విషయంలోకి వెళితే... వివిధ సినీ ఇండస్ట్రీల్లో మోస్ట్‌ పాపులర్‌ నటులు ఎవరనే విషయంలో ప్రముఖ మీడియా కన్సల్టింగ్‌ సంస్థ 'ఓర్మాక్స్‌ మీడియా' తాజాగా ఒక సర్వే ను నిర్వహించింది.  

సర్వే లో టాలీవుడ్ స్టార్ హీరోల జాబితా లో జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ వన్ స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో ప్రభాస్ , మూడవ స్థానంలో అల్లు అర్జున్ , నాలుగో స్థానంలో రామ్ చరణ్ ,  ఐదవ స్థానంలో మహేష్ బాబు ,  ఆరవ స్థానంలో పవన్ కళ్యాణ్ , ఏడవ స్థానంలో నాని , ఎనిమిదవ స్థానంలో విజయ్ దేవరకొండ , తొమ్మిదవ స్థానంలో చిరంజీవి ,  పదవ స్థానంలో రవితేజ నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: