అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకుని జూబ్లీహిల్స్‌లోని ఆయన బంగళా వద్ద పండుగ వాతావరణం నెలకొంది. వేల సంఖ్యలో అభిమానులు బన్నీని చూడటానికి ఆయన ఇంటికి చేరుకున్నారు. టపాసులు కాల్చుతూ, కేకులు కట్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. కొందరు అభిమానులు ‘పుష్పరాజ్’ గెటప్‌లో వచ్చి సందడి చేయడం విశేషం.తమ అభిమాన నటుడు క్షేమంగా ఉండాలని ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బన్నీ ఇంటి ముందు జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఆ క్షణం వచ్చేసింది. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ చేయబోయే AA22 చిత్రానికి ‘రాకా’ (RAAKA) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది.ఈ టైటిల్ పోస్టర్‌లో బన్నీ లుక్ మునుపెన్నడూ చూడని విధంగా ‘వైల్డ్’గా ఉంది. షేవ్ చేసిన తల, దట్టమైన గడ్డం, కళ్ళల్లో తీవ్రమైన కోపం.. అన్నీ కలిసి ఈ సినిమా ఒక రేంజ్ లో ఉండబోతోందని హింట్ ఇస్తున్నాయి.ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది. పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ మల్టిపుల్ రోల్స్‌లో కనిపించబోతున్నారని సమాచారం.ఏప్రిల్ 8 ఉదయం 11 గంటలకు విడుదలైన ఈ పోస్టర్ కొన్ని నిమిషాల్లోనే లక్షలాది లైక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి