జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరో గా తాజాగా నటించిన చిత్రం శేఖర్. ఇక ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని కోర్టు వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. దీంతో థియేటర్లలో ఈ సినిమా రెండు రోజుల తర్వాత ప్రదర్శనను నిలిపివేశారు. ఇకపోతే తాజాగా మరొకసారి శేఖర్ సినిమా పై కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాజశేఖర్ తనకు డబ్బులు ఇవ్వాలి అని ఫైనాన్షియర్ పరంధామరెడ్డి కోర్టులో సోమవారం రోజు పిటిషన్ వేయగా దీనిని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కొట్టివేసింది. అంతేకాదు శేఖర్ సినిమా ప్రదర్శనకు కోర్టు అనుమతి ఇవ్వడం ప్రస్తుతం హర్షదాయకం అని చెప్పవచ్చు .అయితే ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తాము చెప్పలేదని కోర్టు వ్యాఖ్యానించినట్లుగా వార్తలు అందుతున్నాయి.

ఇకపోతే కొంతమంది ఉద్దేశపూర్వకంగా శేఖర్ సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించినట్లుగా దర్శకురాలు జీవిత రాజశేఖర్ అలాగే నిర్మాత తరపు న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు వినిపించడం జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను జీవిత రాజశేఖర్ తో పాటు నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరఫు న్యాయవాదులు మంగళవారం రోజు కోర్టులో వెల్లడించారు. ఇకపోతే ఈ మేరకు రాజశేఖర్ నటించిన సినిమా ఆగిపోవడంతో తమకు నష్టం జరుగుతోందని ఈ సినిమా నెగిటివ్స్ మీద ఉన్నా రద్దు చేయాలని కూడా  కోర్టును ఆశ్రయించడం జరిగింది.

ఇక అదే సమయంలో పరంధామరెడ్డి తరపు లాయర్లు కూడా సినిమా ప్రదర్శించడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని అయితే వచ్చే కలెక్షన్లలో మాకు ఇవ్వాల్సిన రూ.60 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని కోరడం జరిగింది. దీనికి ఏకీభవించిన జడ్జి వెంటనే సినిమా పునః ప్రారంభించాలని ప్రదర్శనకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు జీవిత రాజశేఖర్ ఇటు నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పవచ్చు. అసలే కష్టాల్లో ఉన్న జీవిత రాజశేఖర్ లు కనీసం ఈ సినిమాతో నైనా ఆర్థికంగా మెరుగు పెడతారో లేదో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: