ఈవారం విడుదల కాబోతున్న ‘ఎఫ్ 3’ పై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే నిర్మాత దిల్ రాజ్ ఈమూవీని భారీ స్థాయిలో ప్రమోట్ చేయిస్తూ తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ధియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈసినిమాను చూసే ప్రేక్షకుడు లాజిక్ పట్టించుకోవద్దు అంటూ లీకులు ఇచ్చాడు.


ఇప్పుడు అనీల్ రావిపూడి మరొక అడుగు ముందుకు వేసి ఈమూవీని చూసే ప్రేక్షకుడు ‘ఎఫ్ 2’ ను దృష్టిలో పెట్టుకుని చూడవద్దని ఈమూవీలో ‘ఎఫ్ 2’ లోని పాత్రలతో పాటు ఇంకా కొత్త పాత్రలు కనిపిస్తాయని మరొక విధంగా లీకులు ఇస్తున్నాడు. ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఆ డబ్బు కోసం విపరీతంగా ఆరాటపడే రెండు పాత్రల చుట్టూ ఈమూవీ కథ నడుస్తూ అడుగడుగునా నవ్విస్తుందని అంటున్నారు.


మూవీ లీకులను బట్టి ఈమూవీని చూసే ప్రేక్షకుడు ‘ఎఫ్ 2’ మూవీని పూర్తిగా మర్చిపోయి ‘ఎఫ్ 3’ మూవీని మరొక కోణంలో చూడాలి. అయితే అనీల్ రావిపూడి ఈమూవీలో ‘ఎఫ్ 2’ లోని రెండు పాపులర్ డైలాగ్ లు ‘ఎఫ్ 3’ లో పెట్టి ట్రైలర్ వదిలాడు. ఇప్పుడు అదే అనీల్ రావిపూడి ‘ఎఫ్ 2’ కథ గురించి మర్చిపోమంటున్నాడు.


ఇప్పుడు అనీల్ రావిపూడి చెపుతున్న మాటలను బట్టి ‘ఎఫ్ 3’ కథ వేరైనప్పటికీ ఆమూవీలోని పాత్రలు అన్నీ ‘ఎఫ్ 2’ లో ఉన్న పాత్రలు కావడంతో సగటు ప్రేక్షకుడు అంత సులువుగా ‘ఎఫ్ 2’ మర్చిపోలేడు కాబట్టి ‘ఎఫ్ 2’ ప్రభావం ఖచ్చితంగా ‘ఎఫ్ 3’ పై పడితీరుతుంది అన్నఅభిప్రాయం కలుగుతుంది. దిల్ రాజ్ ‘ఎఫ్ 3’ టిక్కెట్ల రేట్లను పెంచకుండా పాత రేట్లకు ‘ఎఫ్ 3’ మూవీని ప్రేక్షకులకు అందిస్తున్న పరిస్థితులలో ఇప్పటికే సినిమాలకు దూరం అయిన చాలామంది ఫ్యామిలీ ప్రేక్షకులు తిరిగి ధియేటర్ల బాట పట్టి ‘ఎఫ్ 3’ కి కనకవర్షం కురిపిస్తుందో లేదో చూడాలి..  మరింత సమాచారం తెలుసుకోండి: