మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఐదేళ్ల క్రితం ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకి హీరోగా కొన్నేళ్ల అనంతరం రి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. వివి వినాయక్ తీసిన ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకుని మెగాస్టార్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని రుజువు చేసింది. అనంతరం సైరా నరసింహారెడ్డి మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, దానితో కేవలం యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకున్నారు. 

ఇక ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో తొలిసారిగా తనయుడు రామ్ చరణ్ తో కలిసి మెగాస్టార్ నటించిన సినిమా ఆచార్య. అందరిలో మొదటి నుండి ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఆచార్య మూవీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం అత్యంత ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. దానితో కెరీర్ పరంగా కొంత ఆలోచనలో పడ్డ చిరు, ఇకపై తన నుండి రానున్న సినిమాల కథ, కథనాల విషయమై మరింత జాగ్రత్త తీసుకోనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ముఖ్యంగా మెగాస్టార్ తో బాబీ తీస్తున్న మూవీ పై అందరిలో మరింత అంచనాలు ఉన్నాయి.

వాల్తేరు వీరయ్య అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పక్కాగా మాస్ యాక్షన్ తో సాగె కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతోందని, ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరూ కోరుకునే అంశాలు ఉండేలా దర్శకడు బాబీ సినిమా స్క్రిప్ట్ ని ఎంతో అద్భుతంగా రాసుకున్నారని టాక్. అలానే ప్రస్తుతం సినిమా కూడా ఎంతో బాగా తీస్తున్న బాబీ తప్పకుండా ఈ మూవీతో మెగాస్టార్ ఖాతాలో సూపర్ సక్సెస్ నమోదు చేయడం, అలానే చిరు బాక్సాఫీస్ తో చెడుగుడాట ఖాయమని సమాచారం. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మరి ఇదే కనుక జరిగితే మెగా ఫ్యాన్స్ కి ఇది పెద్ద పండుగే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: