ఎఫ్ 3 మూవీ నేడు గ్రాండ్‌గా విడుదల అవుతుంది. అయితే ఎఫ్‌2 సీక్వెల్‌గా తెరకెక్కిన ఎఫ్ 3 చిత్రం బిగ్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తోందనే టాక్ విన్పిస్తోంది.ఇక ఈ సినిమాలో వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా భాటియా, మెహ్రీన్ పీర్జాదా నటీనటులుగా..కాగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్ గా ఎఫ్ 3 చిత్రం తెరకెక్కగా, ఈ సినిమా ఫన్ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకుంది.అయితే ఈ సినిమా  హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.ఇకపోతే  ఎఫ్ 2 సినిమాను మించి ఉందని రివ్యూలు పాజిటివ్‌గా వస్తున్నాయి. ఇక్క్ ఈ సినిమాలో రేచీకటి క్యారెక్టర్‌లో వెంకటేశ్ అదరగొడితే..నత్తి క్యారెక్టర్‌లో వరుణ్ తేజ్ అద్భుతంగా ఎంటర్‌టైన్ చేశాడంటున్నారు.

అయితే ఎఫ్3 చిత్రానికి ఉన్న క్రేజ్ తో బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది.ఇదిలావుండగా తాజా సమాచారం మేరకు ఎఫ్3 ఓటిటి డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఐత3 ఎఫ్3 చిత్ర ఓటిటి రైట్స్ ని ఫ్యాన్సీ ప్రైజ్ కి సోనీ లివ్ సంస్థ దక్కించుకుందట.ఇకపోతే  దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా ఓటిటి రైట్స్ కోసం అమెజాన్ సంస్థ కూడా పోటీ పడ్డప్పటికీ సోనీ లివ్ దక్కించుకున్నట్లు టాక్. అంతే కాదు దాదాపు 18 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం.ఎఫ్2 చిత్రంలో కామెడీని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు.. ఫ్యామిలీ, మాస్, యూత్ ఇలా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారు. ఇకపోతే ఆ క్రేజ్ తోనే ఎఫ్3 మూవీపై సోనీ లివ్ భారీ ధర వెచ్చించింది.

అయితే పక్కాగా ప్లాన్ చేస్తే కామెడీ చిత్రాలకు ఉండే స్థాయి ఇది అని అంటున్నారు. అంతేకాదు సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు ఓటిటి రైట్స్ 20 నుంచి 30 కోట్ల వరకు పలుకుతుంటాయి. ఇక ఆ లెక్కన చూస్తే ఎఫ్3 మూవీ అదిరిపోయే డీల్ అందుకున్నట్లే. అయితే కామెడీ చిత్రాలకు రిపీట్ వ్యాల్యూ కూడా ఉంటుంది. కాగా  ఎఫ్ 3 కనుక పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే సోనీ లివ్ సంస్థ పంట పండినట్లే.ఇదిలావుండగా ఎఫ్3 చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా దాదాపు 60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. పోగా ఎఫ్2 చిత్రం ఫుల్ రన్ లో 80 కోట్ల వరకు షేర్ రాబట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎఫ్ 3 పాజిటివ్ టాక్ అందుకుంటే తప్పకుండా బయ్యర్లకు లాభాలు అందిస్తుందని అంటున్నారు.ఇక  అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: