ప్రభాస్ రెండు డిజాస్టర్ ల తర్వాత భారీ విజయాన్ని నమోదు చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్నాడు. బాహుబలి సినిమా తర్వాత ఆయన చేసిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని అందుకున్నాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సాహో మరియు రాధే శ్యామ్ చిత్రాలు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాయి అనే చెప్పాలి. కారణం ఏదైనా కూడా ప్రభాస్ ఈ రెండు చిత్రాల ఎంపిక సరైనది కాదు అని అభిమానులు సైతం ఆయనకు సూచనలు చేస్తున్నారు.
ప్రస్తుతం అందరి చూపు కూడా ప్రభాస్ హీరోగా చేస్తున్న సలార్ చిత్రం పైనే ఉంది. ప్రశాంత్ నీల్ లాంటి దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం వల్లనే ఈ సినిమాకు ఇంతటి స్థాయిలో క్రేజ్ వుంది. కే జీ ఎఫ్ సినిమా తో మరో సంచలన విజయాన్ని అందుకున్న ఈ కొద్ది సమయంలోనే ఈ చిత్రాన్ని మొదలుపెట్టి 50 శాతం షూటింగ్ పూర్తి చేసిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రం ద్వారా ప్రభాస్ అభిమానులకు మాస్ ట్రీట్ ఇస్తాడన్న నమ్మకంతో ఉన్నాడు. అందుకే ఈ సినిమా పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సినిమా చేయబోతున్నాడు అని అంటున్నారు.
అయితే ప్రభాస్ తనకు ఎదురైన రెండు ఫ్లాప సినిమాల కారణంగా ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలను మరింత రక్తి కట్టించే విధంగా ఉండాలని ప్రశాంత్ కు సూచించాడట. అంతే కాదు అవసరమైతే మరికొన్ని యాక్షన్ సీన్స్ ను ఈ సినిమాలో జోడించాలి అని కూడా ఆయన చెప్పారట. మరి ప్రశాంత్ నీల్ సహజమైన పద్ధతిలో కాకుండా ప్రభాస్ సూచించిన విధంగా వెళ్తే ఏ విధమైన ఫలితాన్నీ ప్రభాస్ ఎందుకు ఉంటాడో చూడాలి. ఈ సినిమాలో ప్రభాస్ ను ఎలివేషన్ చేసే తీరు చాలా బాగుందని ఆ స్థాయిలో ఇప్పటివరకు ఏ దర్శకుడు కూడా ప్రభాస్ను ఎలివేషన్ చేయలేదు అని కూడా వారు చెబుతున్నారు ప్రభాస్ అభిమానులు కోరుకునే విధంగా ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
అక్కినేని హీరోలు ఎక్కడా తగ్గడం లేదుగా..!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి