పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా స్పోర్ట్ డ్రామాగా తెరకెక్కగా ఈ సినిమా ఆగస్టు 25 న విడుదల అవుతుంది. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. పూరీజగన్నాధ్ సినిమాలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. ఆయన హీరోలను చూపించే విధానం ఎంతో వెరైటీ గా ఉంటుంది. అలా ఈ సినిమా లో కూడా విజయ్ దేవరకొండ ను ఎంతో వెరైటీ గా చూపించారని అంటున్నారు. మరి ఈ సినిమా స్థాయి లో హిట్ అవుతుందో చూడాలి.
ఈ సినిమా తరవాత ప్రేమకథ సినిమా ఖుషి ని విడుదల చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా ప్రస్తుతం ఈ సినిమా భారీ షెడ్యూల్ ను షూట్ చేస్తుంది చిత్ర బృందం. యాక్షన్ సినిమా తర్వాత ఇలా ప్రేమకథ సినిమా చేయడం విజయ్ కె చెల్లింది. ఆ తర్వాత జె జీ ఎం సినిమా కూడా మరో యాక్షన్ భరితమైన సినిమా. ఆ తర్వాత సుకుమార్ సినిమా కూడా మాస్ మసాలా సినిమా. మరి ఇలా వరుస డిఫరెంట్ జోనర్ సినిమాలతో ఆకట్టుకుంటున్న విజయ్ దేవరకొండ ఇంత తక్కువ సమయంలో ఇండస్ట్రీ ని అర్థం చేసుకోగల నాలెడ్జ్ రావడం నిజంగా విశేషం అంటున్నారు ఆయన అభిమాను. మరి సక్సెస్ ఆయన ఏ స్థాయి లో వరిస్తుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి