మాస్ మహరాజ రవి తేజ ఇప్పుడు వరుస సినిమాలతో బిజిగా ఉన్నాడు.. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండు సినిమాలు కూడా అనుకున్న ఫలితాలను అందుకోలేక పోయాడు.. అయిన వెనకడుగు వెయ్యకుండా వరుస సినిమాలకు సైన్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా చాలా బిజిగా ఉన్నాడు..అయితే మాత్రం ఈ హీరో మాస్ యాక్షన్ సినిమాలను చేస్తున్నాడు. భారీ యాక్షన్ సినిమాల లో తనే డూప్ లేకుండా చేయడం వల్ల ఆయన ఫ్యాన్స్ కూడా రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు..
ఇకపోతే ఇప్పుడు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు.. కాగా, త్వరలో ‘రామారావు ఆన్ డ్యూటీ’గా రానున్నాడు రవితేజ. ప్రస్తుతం రవితేజ హీరోగా మొదటి పాన్ ఇండియా సినిమా 'టైగర్ నాగేశ్వరరావు' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా, అభిషేక్ అగర్వాల్ నిర్మాణంలో తెరకెక్కుతుంది.ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ఓ సెట్ లో ఈ సినిమా షూట్ జరుగుతుంది. షూటింగ్ లో భాగంగా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తుండగా రవితేజ గాయపడ్డారు. ఆయన మోకాలికి గాయమై, పది కుట్లు పడ్డాయని చిత్ర యూనిట్ తెలిపారు.
గాయం కొద్దిగా ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు.. అయినా రవితేజ 'నో రెస్ట్' అంటూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్, ఇతర నటీనటుల డేట్స్‌ని దృష్టిలో పెట్టుకుని, తన కారణంగా షూటింగ్ ఆగకూడదు అని రవితేజ రెండు రోజులు హాస్పిటల్ లో ఉండి మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దీంతో ఈ విషయం తెలిసిన అభిమానులు, ప్రేక్షకులు రవితేజని మెచ్చుకుంటున్నారు...ఏది ఏమైనా రవితేజ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. ఈ గ్యాప్ తో సినిమాకు కాస్త ఆలస్యం అవుథుందని సినీ వర్గాల్లొ టాక్ వినిపిస్తోంది...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి