నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల అఖండ సినిమాతో అఖండమైన విజయం సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే .ఇక ఈ సినిమా అనంతరం బాలయ్య బాబు వరుస సినిమాలు లైన్లో బిజీ గా మారాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది అదేంటంటే అఖండ సినిమా సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న బాలయ్య అని....ఇదిలావుంటే బాలయ్య ప్రస్తుతం తన 107వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఖచ్చితంగా బాలయ్య గత చిత్రం అఖండ ఊహించని విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు గత ఏడాది డిసెంబర్‌లో రిలీజై బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామీని సృష్ఠించింది.కాగా చెప్పాలంటే బాలయ్య రేంజ్‌కు పెట్టాల్సిన బడ్జెట్ కాదు. అయితే అంత తక్కువ బడ్జెట్ కేటాయించారు. ఇకపోతే బాలయ్య సూచన మేరకే సినిమా బడ్జెట్ పెట్టడం.. ప్రి రిలీజ్ బిజినెస్ జరగడంతో అఖండకు అదిరిపోయే లాభాలు వచ్చాయి.ఇదిలావుంటే ఈ ఎన్‌బీకే 107 ఈ ఏడాది దసరా బరిలో దింపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక తాజా సమాచారం మేరకు బాలయ్య అఖండ సినిమా సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ మళ్ళీ తన 107వ సినిమాను కూడా డిసెంబర్‌లోనే రిలీజ్ చేసేలా మేకర్స్‌కు సూచించారట.

అయితే  చెప్పాలంటే ఇప్పటివరకు పెద్ద సినిమాలేవీ డిసెంబర్‌లో రిలీజ్ అవుతున్నట్టు అప్‌డేట్ లేదు.కాగా ఒకవేళ పెద్ద సినిమాలు ఉన్నా బాలయ్యకు ఏమీ సమస్యలుండవు.కాగా  గత ఏడాది పుష్ప సినిమా ఉన్నా..అది పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజైనా బాలయ్య అఖండ వసూళ్ళు గురించి ఇంకా చెప్పుకుంటున్నారు.ఇకపోతే  డిసెంబర్‌లో ఏ పాన్ ఇండియా సినిమా రిలీజైనా బాలయ్య అనుకుంటే తన 107ను రిలీజ్ చేయడానికి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయరు.ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది.కాగా  బాలయ్య శైలికి ఏమాత్రం తగ్గకుండా గోపీచంద్ మలినేని మార్క్ యాక్షన్ సినిమాగా ఇది రూపొందుతోంది. .!!

మరింత సమాచారం తెలుసుకోండి: