టాలీవుడ్ లో యంగ్ టాలెంట్ కు కొదువలేకుండా పోతోంది. స్టార్ హీరోల రేంజ్ లో కాకపోయినా తమ పరిధిలో మంచి కథలను ఎంచుకుంటూ కథకు 100 శాతం న్యాయం చేస్తున్నారు. ఇక రీసెంటుగా అలా రివ్వున దూసుకువచ్చిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఇతను చూడడానికి మన ఇంటిలో కుర్రాడిలాగానే ఉంటాడు. తన సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పటి వరకు కిరణ్ నుండి వచ్చిన నాలుగు సినిమాలలో అన్నీ మంచి కథలే. దర్శకుని లోపం వల్ల ఏమైనా ఫలితం తారుమారు అయినా ఇతని నటన మాత్రం హైలైట్ అని చెప్పాలి. తాజాగా కిరణ్ నటించిన మూవీ సమ్మతమే. ఈ సినిమా ఈ రోజు థియేటర్ లో అంచనాలతోనే రిలీజ్ అయింది.

అయితే కొన్ని షోలు అయ్యాక మరియు కొన్ని మీడియా సంస్థలు రివ్యూలు చూశాక అర్థమైంది ఏమిటంటే.. మరోసారి తన ప్రయత్నం బెడిసికొట్టింది అని టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ మంచి లైన్ ను తీసుకున్నా.. కథలో అంతగా డెప్త్ లేకపోవడంతో సో సో గా ఉందని పబ్లిక్ అంటున్నారు. ఎప్పుడైనా ఒక కథను డీల్ చేసేటప్పుడు నిజ జీవితానికి సినిమాకు తేడా చూపిస్తూ స్క్రీన్ ప్లే రాసుకోవాలి. మన చేతిలో పెన్ను ఉంది కదా అని లాజిక్ లేకుండా సీన్స్ రాసుకుంటే ప్రేక్షకులకు నచ్చడం కష్టమే. ఇందులో కూడా సరిగ్గా అదే జరిగింది.

పెళ్ళికి ముందు ఒక అమ్మాయి తనకు నచ్చినట్లు జీవించి.. సడెన్ గా పెళ్లి అయ్యాక మాత్రం భర్తకు నచ్చినట్లుగా తనను మార్చుకోవాలి అన్న పాయింట్ కొంచెం తేడగా ఉంది. అయితే కథనంలో అయినా కొత్తదనం ఉందా అంటే అది కూడా లేదు. దీనితో డైరెక్టర్ గోపినాధ్ రెడ్డి కిరణ్ అబ్బవరం కష్టాన్ని బూడిదపాలు చేశాడు. ఇందులో లీడ్ రోల్స్ చేసిన కిరణ్ అబ్బవరం మరియు చాందినీ చౌదరీలు తమ పాత్రలకు న్యాయం చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: