టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు అయిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఆర్ ఆర్ ఆర్ సినిమా కంటే ముందు వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగిన జూనియర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు .

అలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియా  సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు . అందులో భాగంగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా  సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే కూడా చాలా కాలమే అవుతుంది. ఈ సినిమా జూన్ నెల నుండి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు గత కొద్ది రోజుల క్రితం అనేక వార్తలు బయటకి వచ్చాయి. కాకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్ట్ నెల నుండి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కొరటాల శివ,  ఎన్టీఆర్ సినిమా క్లైమాక్స్ కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ 30 వ సినిమా క్లైమాక్స్ కోసం ఇప్పటికే భారీ సెట్ ను చిత్రబృందం నిర్మించినట్లు తెలుస్తోంది. క్లైమాక్స్ సన్నివేశంలో ఉండే భారీ బ్లాస్ట్ సన్నివేశం అదిరిపోనున్న ట్లు సమాచారం అందుతుంది. ఈ క్లైమాక్స్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉండటం కోసం కొరటాల శివ తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: