ఫిధా ఫెమ్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..అందం, నటన కలిగిన నటి.. టాలెంట్ మీదే తను సక్సెస్ ను అందుకుంది..సినిమాలు ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవల వచ్చిన సినిమాలు అన్నీ కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.కొన్ని సినిమాలకు హీరో ఉన్నా కూడా సాయి పల్లవి పేరు మీదే సినిమాను ప్రమోట్ చేసి మార్కెట్ వద్ద బజ్ క్రియేట్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. అయితే, ఎంత క్రేజ్ ఉన్నా కూడా సాయి పల్లవి ఖాతాలో హిట్స్ మాత్రం తక్కువే చేరుతున్నాయి. ఇటీవల వచ్చిన విరాట పర్వం సినిమా ఎన్ని అంచనాల మధ్య వచ్చిందో అందరికీ తెలిసిందే.


రానా దగ్గుబాటి, ప్రియమణి, నందితా దాస్, నివేతా పేతురాజ్ లాంటి క్రేజీ స్టార్స్ ఉన్నా కూడా సినిమా మొత్తాన్ని కేవలం సాయి పల్లవి క్రేజ్‌తోనే ప్రమోట్ చేసి రిలీజ్ చేశారు. కానీ, విరాట పర్వం సినిమా అనూహ్యంగా ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరింది. ఇంత దారుణంగా ఫ్లాపవుతుందని ఎవరూ ఊహించలేదు. స్క్రీన్ ప్లే కాస్త ఆసక్తికరంగా ఉన్నా విరాట పర్వం సినిమా మినిమం హిట్ గా నిలిచేది. కానీ, సాయి పల్లవి ఇమేజ్ కూడా సినిమాను నిలబెట్టలేకపోయింది. దాంతో కొంత నెగిటివిటీకి గురైంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె చెసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపి అనవసరంగా ట్రోల్స్ ఎదురుకుంది. అయితే, ఇప్పుడు సాయి పల్లవి నటించిన మరో సినిమా రిలీజ్ కాబోతోంది.


సినిమా విడుదలకు పెద్ద సమయం లేదు. అయినా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు తమిళ స్టార్ హీరో సూర్యజ్యోతిక రెడీ అవుతున్నారు. సాయి పల్లవి ప్రధాన పాత్రలో ‘గార్గి’ అనే సినిమా తెలుగు, తమిళం, కన్నడ భాషలలో రిలీజ్ కాబోతోంది. ఇదే నెలలో సినిమాను 14వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల మొత్తం వరుసగా సినిమాలు ఉన్నాయి. పోనీ ఆ తర్వాత రిలీజ్ చేద్దామంటే అన్నీ పెద్ద సినిమాలున్నాయి. ఇప్పుడేమో అసలు ప్రమోషన్స్‌కు సమయం లేదు. ఎంత సాయి పల్లవిసూర్య ఇమేజ్‌లపై ఆధారపడి సినిమాను రిలీజ్ చేసిన 10 రోజుల్లో అంచనాలు పెంచడం చాలా కష్టం..ఏదైనా తేడా జరిగితే మాత్రం అమ్మడుకు భారీ షాక్ తగిలినట్లే..


మరింత సమాచారం తెలుసుకోండి: