మాస్ మహారాజా రవితేజ   ఫ్యాన్ బేస్ గురించి మనకి తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ జూలై 29న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.ఇక  ఈ మూవీ రిలీజ్‌కు ఇంకా నెల రోజుల లోపే సమయం మిగిలి ఉన్నందున, ఈ చిత్ర నిర్మాతలు భారీ ప్రీ-రిలీజ్ ప్రమోషనల్ ఈవెంట్‌లకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.ఇదిలావుండగా ఈ నేపథ్యంలోనే రవితేజ తాను ఈ మూవీ ప్రమోషన్లకు రానంటే రాను అని మూవీ యూనిట్‌కి తేల్చి చెప్పాడట.ఇకపోతే తాజాగా రవితేజ ఎడిటింగ్ రూమ్‌లో రామారావు ఆన్ డ్యూటీ సినిమాను చూశాడు. 

అయితే  ఇక  మూవీ ఔట్‌పుట్‌ అసలు నచ్చకలేదట. కాగా అందుకే ఈ సినిమాకి ప్రమోషన్లు చేసినా.. చేయకపోయినా అట్టర్ ఫ్లాప్ అవుతుందనే ఓ నిర్ణయానికి వచ్చాడట.అంతేకాక  ఆ కారణంగానే ఏ ప్రమోషనల్ ఈవెంట్‌కి రాకూడదని రవితేజ యోచిస్తున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఇక మేకర్స్ తమ ప్రమోషన్లను హీరో లేకుండా ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.ఇదిలావుంటే నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహించారు. ఇకపోతే ఈ మూవీలో పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సహాయం అందిస్తూ అవినీతిని నిర్మూలించే పని చేపడతాడు రవితేజ.

అయితే నిజాయితీగల ఎమ్మార్వో ఆఫీసర్ గా అలరించనున్నాడని ఇప్పటికే మూవీ యూనిట్ తెలిపింది.ఇక  ఇందులో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ అనే హీరోయిన్స్ గా నటించారు.కాగా  ఈ మూవీలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటించాడు.పోతే  నాజర్, సీనియర్ నరేష్, పవిత్రా లోకేష్ ఇతర సహాయక పాత్రల్లో నటించారు. ఇక దీనిని SLV సినిమాస్, LLP, RT టీమ్‌వర్క్స్ క్రింద సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.అయితే మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ఈ సినిమాకోసం ఆయన ఫాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు.!!

మరింత సమాచారం తెలుసుకోండి: