ఈసారి కమర్షియల్ సినిమాతో అదరగొట్టడానికి వస్తున్నారు హీరో విశాల్. తాను నటిస్తున్న చిత్రం లాఠీ. ఈ సినిమాలో హీరో విశాల్ కానిస్టేబుల్ గా కనిపించనున్నారు. మొదట పందెంకోడి సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని లాఠీ సినిమా వరకు తన ఇమేజ్ను పెంచుకుంటూ వచ్చారు విశాల్.లాఠీ సినిమా భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాని తమిళ్, తెలుగు, మలయాళం, భాషలలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్లు బాగా వైరల్ గా మారాయి.

ఇక తాజాగా తెలుగులో కూడా ఈ సినిమా టీజర్ ని విడుదల చేయడం జరిగింది. ఇందులో విశాల్ ఒక పోలీస్ ఆఫీసర్ గా నిజాయితీకి చెందిన ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ వస్తున్నట్లుగా ఈ సినిమా టీజర్ల చూపించడం జరిగింది. కేవలం ఒక కానిస్టేబుల్ విలన్ లను ఎలా చుక్కలు చూపించారో ఈ సినిమా టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమా కి భారీగానే స్టెంట్లు చేసినట్లుగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా ఈ సినిమాకి హైలైట్ గా ఉండబోతుందని చెప్పవచ్చు.

విశాల్ కూడ ఎంతో కూల్ గా సైలెంట్ గా ఈ సినిమాలోని డైలాగులు చెప్పడం బాగా ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ తో విశాల్ తమ అభిమానులకు మాస్ మాసాల ఇచ్చాడని చెప్పవచ్చు. మరి ఈ సినిమా విడుదలై ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమాని డైరెక్టర్ వినోద్ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా లేవాలో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో విశాల్ తరఫున సునైనా హీరోయిన్గా నటిస్తున్నది. ఇక ఈ చిత్రం ఆగస్టు 15వ విడుదల కావాలితే ఉండగా కానీ కొన్ని కారణాలవల్ల సెప్టెంబర్ 15న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఒకే టైటిల్ ని అన్ని భాషలలో విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ చాలా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: