టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర కథానాయకగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సమంత సినిమాలను తగ్గించు కుంటూ వచ్చింది. ఎప్పుడైతే ఆమె తన వివాహ బంధాన్ని రద్దు చేసుకుందో అప్పటి నుంచి మళ్లీ సినిమాలు ఒప్పుకునే విధంగా ముందుకు వెళ్లి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పవచ్చు. వివాహం తర్వాత చాలామంది కథానాయకలు సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించరు కానీ వారందరికీ భిన్నంగా సమంత కొన్ని సినిమాల్లో నటించింది.

ఇప్పుడు ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఆమె పోకడ చూస్తుంటే మాత్రం టాలీవుడ్ లో కాకుండా భవిష్యత్తులో బాలీవుడ్ లో సెటిల్ అయ్యే విధంగా ఆలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. టాలీవుడ్ సినిమాలను చేస్తూనే ఇంకొక వైపు బాలీవుడ్ లో వరుస సినిమాలకు ఆమె అంగీకరిస్తుంది. అంతేకాదు హాలీవుడ్ చిత్రాలలో సైతం నటించేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను అలదించబోతున్న ఈ ముద్దుగుమ్మ మరొక బాలీవుడ్ సినిమాలో కూడా నటించనున్నట్లుగా తెలుస్తుంది.

త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది. ఇక టాలీవుడ్ సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవర కొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇది మాత్రమే కాకుండా రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తూ ఉండడం విశేషం. ఈ చిత్రాల తర్వాత ఈ ముద్దుగుమ్మకు ఏ స్థాయిలో క్రేజ్ పెరుగుతుందో చూడాలి. విడాకుల తర్వాత తీవ్ర మనోవేదన కు గురైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరిన్ని సిని మా అవకాశాలను రాబట్టుకుంది అంటే మాములు విషయం కాదు. భారీ స్థాయి లో ఆమె తన అనుభవాన్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఈ అవకాశాన్ని రాబట్టుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: