ప్రస్థుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని వేదిస్తున్న హీరోయిన్స్ కరువును తీరచాబితున్న క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ అంటూ ఆమె పై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘సీతా రామం’ మూవీ చూసి బయటకు వచ్చిన వారు ఎక్కడ చూసినా మృణాల్ ఠాకూర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈమూవీలో సీత పాత్రలో నటించిన ఆమె నటనకు యూత్ ఫిదా అయిపోతోంది.


కళ్ళ తో ఆమె ఆమె చూపించిన భావ ప్రకటన యూత్ కు బాగా నచ్చింది. దర్శకుడు హను రాఘవపూడి హీరోయిన్స్ ను చాల అందంగా చూపిస్తాడు అన్న పేరుంది. దానికి తగ్గట్టుగా ఈమూవీ కథలో ఆమె హీరోయిన్ గా కాకుండా సీత పాత్రగానే ఆమె జనానికి కనెక్ట్ అయింది. వాస్తవానికి ఆమె కొత్త హీరోయిన్ కాదు.


ఆమె బాలీవుడ్ లో చాల సినిమాలు నటించినప్పటికీ ఏసినిమా పెద్దగా ఆమెకు కలిసిరాలేదు. దీనికితోడు ఆమెకు బోల్డ్ బ్యూటీ అన్న పేరు కూడ ఉంది. రకరాకాల ఎక్స్ పోజింగ్ లు చేస్తూ ఆమె ఉత్తరాది యూత్ ను ఆకట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమెకు అక్కడ కాలం కలిసిరాలేదు. ఆమె గురించి నిర్మాత స్వప్నా దత్ కు తెలియడంతో ఆమె పట్టుపట్టి ఈమూవీలో సీత పాత్రకు చాల సాహసోపేతంగా ఎంపిక చేసింది అని అంటారు. ఒకప్పుడు యూత్ కు క్రేజీ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలిగిన తమన్నా కాజల్ అనుష్క రకుల్ ప్రీత్ లు ఇప్పుడు తమ ప్రాభవాన్ని కోల్పోవడంతో యూత్ కు క్రేజీ హీరోయిన్స్ గా పూజా హెగ్డే రష్మికలు మాత్రమే మిగిలారు. వీరి పారితోషికం విపరీతంగా పెరగడంతో పాటు వీరి డేట్స్ గురించి టాప్ యంగ్ హీరోలు  కూడ ఎదురు చూడవలసిన పరిస్థితి.


ఇప్పుడు ఆ కరువును మృణాల్ ఠాకూర్ తీరుస్తుంది అన్న అంచనాలు వస్తున్నాయి, ఒకప్పుడు క్రేజీ హీరొయిన్ అంటే ఎక్స్ పోజింగ్ చేయవలసి వచ్చేది. అయితే ఇప్పుడు సాంప్రదాయ బద్దంగా కనిపిస్తూ గ్లామర్ ఒలక పోయగల హీరోయిన్స్ కు మంచి క్రేజ్ కొనసాగుతోంది..మరింత సమాచారం తెలుసుకోండి: