అందాల ముద్దుగుమ్మ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన వన్ నేనొక్కడినే మూవీ తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది . వన్ నేనొక్కడినే మూవీ బాక్సా ఫీస్ దగ్గర కమర్షియల్ విజయం సాధించకపోయి నప్పటికీ కృతి సనన్ కు మాత్రం మంచి గుర్తింపు లభించింది . వన్ నేనొక్కడినే మూవీ తర్వాత బాలీవుడ్ పై కృతి సనన్ ఫోకస్ పెట్టింది . 

అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీ లో నటించిన దిల్‌వాలే , లుకా చప్పీ ,  మిమి వంటి సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం కృతి సనన్, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది పురుష్ సినిమాలో కథానాయికగా నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా కృతి సనన్ తో ఇంటర్వ్యూ లో పాల్గొంది. తాజా ఇంటర్వ్యూలో భాగంగా కృతి సనన్ తన జేర్నీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా కృతి సనన్ మాట్లాడుతూ ... నాలోను చాలా  భావోద్వేగాలు ఉంటాయి. కొన్ని మూవీ లను నేను చాలా నమ్మి చేస్తాను.  ఆ సినిమాలు ప్లాప్ అయినప్పుడు నేను అస్సలు తట్టుకోలేను. అయ్యినప్పటికి నాలో నేను ఎంతో బాధను దిగమింగుకుని మరో మూవీ లోకి వెళ్లాలి. మూవీ సక్సెస్ అయిన లేక  ఫెయిల్యూర్ అయిన  దానిని తప్పకుండా అంగీకరించాలి. ఆ ఫెయిల్యూర్ నుంచి  గుణపాఠం నేర్చుకోవాలి. ఆ తర్వాత మూవీ సక్సెస్ సాధిస్తుంది అని నమ్మాలి అంటూ తాజా ఇంటర్వ్యూలో భాగంగా కృతి సనన్ చెపు కొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: