మా టీవీ లో ప్రసారమయ్యే వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ తెలుగులో ఐదు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఆరవ సీజన్ ను కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకోవడానికి సిద్ధం అవుతుంది..ఇకపోతే గత బిగ్ బాస్ సీజన్ 5 లో సన్నీ కప్ అందుకుని అందరిని ఆశ్చర్య పరచగా షణ్ముఖ్ రన్నర్ గా మిగిలిపోయాడు.అయితే ఇక సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా పూర్తి అవ్వడంతో ఇప్పుడు సీజన్ 6 కూడా స్టార్ట్ చేయబోతున్నారు నిర్వాహకులు.కాగా  మధ్యలో బిగ్ బాస్ ఓటిటి తో రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే..

ఇప్పుడు సీజన్ 6 అంగరంగ వైభవంగా స్టార్ట్ చేయబోతున్నారు. ఇదిలావుంటే ఇక ఈసారి కూడా నాగార్జున నే హోస్ట్ గా వస్తున్నాడు.. సరికొత్తగా ఎంటర్టైన్మెంట్ అంటూ సీజన్ 6 ప్రోమో రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు.అయితే ఇది పక్కన పెడితే ఇప్పటికే ఈ సీజన్ 6 లో కంటెస్టెంట్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక  ఆ కంటెస్టెంట్స్ లిస్టులో ఒక యాంకర్ కూడా ఉన్నారు.అయితే ఈసారి కూడా యాంకర్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు బిగ్ బాస్.. ఇక ఈసారి యాంకర్ ఉదయభాను ఈ సందడి చేయబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే ఉదయభాను గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. పోతే ఈమె ఇప్పుడు ఉన్న యాంకర్స్ కంటే ముందుగానే ఇండస్ట్రీలో అడుగు పెట్టి టాప్ లో కొనసాగింది. అయితే ఇక  కొంత కాలంగా ఈమె యాక్టివ్ గా లేదు.. ఇక ఇప్పుడిప్పుడే ఈమె లైమ్ లైట్ లోకి వస్తుంది. ఇదిలావుంటే ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె ఈసారి సీజన్ లో కనిపించడమే కాకుండా అందరికంటే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న జాబితాలో టాప్ ప్లేస్ లో ఉందట..  అయితే మరి టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఉదయభాను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: