మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరూ కూడా ప్రస్తుతం తమ తమ కెరీర్ లను బిల్డ్ చేసుకొనే ప్రయత్నాల్లో ఉన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నుంచి మొన్న మొన్న వచ్చిన వైష్ణవ్ తేజ్ వరకు కూడా మంచి మంచి హిట్లు దక్కించుకొని హీరోలుగా తమ కెరీర్లో బాగా సెటిల్ అయిపోయారు.అయితే ఇదే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయిన మరో మెగా వారసుడు పవన్ తేజ్ కొణిదెల.కారణం అతని లుక్స్ అని చెప్పాలి. ఇక ఈ కథలో పాత్రలు కల్పితం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పవన్ తేజ్ .. హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. ఇక ఇటీవల వచ్చిన ఆచార్య ఇంకా వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన చిత్రాల్లో విలన్ గా కూడా నటించిన పవన్ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. తాను ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థంని జరుపుకున్నాడు. ఇక ఆమె ఎవరో కాదు ఈటీవీ యాంకర్ అండ్ కుర్ర హీరోయిన్ మేఘన. పవన్ తేజ్ హీరోగా చేసిన ఈ కథలో పాత్రలు కల్పితం చిత్రంతోనే హీరోయిన్ గా ఆమె ఎంట్రీ ఇచ్చింది.ఇక ఈటీవీ లో ప్రసారమయ్యే కొన్ని షోల ద్వారా  మేఘన చాలా బాగా ఫేమస్ అయ్యింది. ఆమె హైట్, పర్సనాలిటీ అందానికి చాలా మంది యూత్ ఫిదా అయ్యారు.


ఇక ఈ జంట మొదటి సినిమా షూటింగ్ లోనే ప్రేమలో పడినట్లు సమాచారం తెలుస్తోంది. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి బుధవారం నాడు నిరాడంబరంగా ఈ జంట నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ హాజరయ్యి కొత్త జంటను ఆశీర్వదించారు. ఆమెతో పాటు రాజీవ్ కనకాల ఇంకా సుమ కనకాల తదితరులు హాజరయ్యారు. ఇక తమ ఎంగేజ్ మెంట్ ఫోటోలను కూడా పవన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ' ప్రేమ అంటే ఏమిటో ఆమె వలనే తెలుసుకున్నాను. ఇంకా అలాగే ఆమెతోనే నిశ్చితార్థం జరగడం ఎంతో ఆనందంగా ఉంది' అంటూ చెప్పుకొచ్చాడు.అలాగే మేఘన కూడా తమ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం పవన్ తేజ్ ఇక ఒక కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: