మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకె క్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇప్పటి వరకు ఈ మూవీ కి చిత్ర బృందం టైటిల్ ని ఫిక్స్ చేయ లేదు . దానితో ఈ మూవీ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 154 మూవీ గా తెరకెక్కుతూ ఉండడం తో ఈ మూవీ మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీ కరణ ను జరుపు కుంటోంది. ఈ మూవీ లో  చిరంజీవి సరసన అందాల ముద్దు గుమ్మ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కె8 సంగీతాన్ని అందిస్తున్నాడు .

మూవీ లో మాస్ మహారాజా రవితేజ ఒక కీలకమైన పాత్ర లో కనిపించబో తున్నాడు. రవితేజ పాత్ర ఈ మూవీ కి హైలెట్ గా నిలవనున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఇంటర్వెల్ సన్నివేశం గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుం ది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ఇంటర్వెల్ సన్నివేశంలో మెగాస్టార్ చిరంజీవి పై మాస్ మహారాజా రవితేజ అటాక్ చేస్తాడు అని , చిరంజీవి మరియు రవితేజ ఈ యాక్షన్ సన్నివేశం తోనే కలుసుకుంటారు అని , ఆ తర్వాత చిరంజీవి మరియు రవితేజ కు మధ్య మంచి అనుబంధం ఏర్పడు తుంది అని ఒక వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: