టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న ముద్దు గుమ్మలలో ఒకరు అయిన అనుపమ పరమేశ్వరన్ కొంత కాలం క్రితమే రౌడీ బాయ్స్ మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ కాస్త హాట్ గా కనిపించి కిస్ సీన్స్ లలో కూడా నటించింది. ఇలా ఈ సంవత్సరం ప్రారంభంలో రౌడీ బాయ్స్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన అనుపమ పరమేశ్వరన్ కొంత కాలం క్రితమే నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన అంటే సుందరానికి మూవీ లో ఒక కీలక పాత్రలో నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ హీరోగా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ లో హీరోయిన్ గా నటించింది.

ఆగస్ట్ 13 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ని తెచ్చుకొని ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లాలి ప్రదర్శించబడుతుంది. దీనితో ఈ మూవీ యూనిట్ తాజాగా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ లో అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ... ఎప్పుడూ కూడా నాకు స్టేజ్ పై ఇంత టెన్షన్ ఉండదు. కానీ ఈ రోజున స్టేజ్ పైకి వస్తుండగానే షివరింగ్ మొదలైంది. మూవీ మంచి విజయం సాధించింది కదా , నువ్వు ఎందుకు సంతోషంగా లేవు అని నా స్నేహితులు అంతా అడుగుతున్నారు .. నిఖిల్ తో సహా  కార్తికేయ 2 మూవీ కోసం ఇంతకాలంగా చేస్తూ వచ్చిన జర్నీ అయిపోయిందనే బాధే నాకు చాలా ఎక్కువగా ఉంది.  ఆ బాధ వల్లనే నేను ఈ మూవీ  హిట్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నాను అంటూ తాజాగా అనుపమ పరమేశ్వరన్ చెప్పు కొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: