యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి భారీ బడ్జెట్ మూవీ లలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే . అందులో భాగంగా ప్రస్తుతం ప్రభాస్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ సలార్ లో హీరోగా నటిస్తున్నాడు . ఈ మూవీ లో శృతి హాసన్ , ప్రభాస్ సరసన హీరోయిన్ గా కనిపించనుంది . రవి బుస్రుర్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు .  ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక కీలక పాత్ర లో కనిపించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇది ఇలా ఉంటే సలార్ మూవీ లో పృథ్వి రాజ్ సుకుమారన్ పాత్రకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది .

మూవీ పృథ్వి రాజ్ సుకుమారన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబో తున్నాడు అని కొంత మంది అంటుంటే , మరి కొంత మంది మాత్రం ఈ మూవీ లో పృథ్వి రాజ్ సుకుమారన్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించ బోతున్నాడు అంటూ చెబుతున్నారు .  ఇలా సలార్ మూవీ లో పృథ్వి రాజ్ సుకుమారన్ పాత్రకు సంబంధించి సోషల్ మీడియాలో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. సలార్ మూవీ యూనిట్ మాత్రం సలార్ మూవీ లో పృథ్వి రాజ్ సుకుమారన్ చేసే పాత్ర గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. కొంత కాలం క్రితమే సలార్ మూవీ ని 28 సెప్టెంబర్ 2023 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: