డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా లైగర్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ హీరో గా నటించిన , బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేమూవీ లో హీరోయిన్ గా నటించింది.

మైక్ టైసన్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా , రమ్య కృష్ణమూవీ లో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించింది. ఈ మూవీ నిన్న అనగా ఆగస్ట్ 25 వ తేదీన చాలా గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు తో పాటు తమిళ , హిందీ , కన్నడ ,  మలయాళ భాషల్లో విడుదల అయ్యింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ లభించింది. దీనితో మొదటి రోజు ఈ మూవీకి చిత్ర బృందం ఆశించిన మేర కలెక్షన్ లు కూడా దక్కలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మొదటగా ఈ మూవీ కథ ను పూరి జగన్నాథ్ ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలకు చెప్పగా వారు రిజెక్ట్ చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... పూరి జగన్నాథ్ మొదటగా లైగర్ మూవీ కథను జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పగా జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసినట్లు , దానితో పూరి జగన్నాథ్ ఈ కథను సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెప్పినట్లు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ మూవీ ని రిజెక్ట్ చేయడంతో పూరి జగన్నాథ్ ఈ కథ ను విజయ్ దేవరకొండ కు వివరించగా విజయ్ ఈ సినిమాను ఓకే చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: