గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం తాజాగా పోన్నియన్ సెల్వన్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ మొదటి భాగం సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా పోన్నియన్ సెల్వన్ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా దర్శకుడు శంకర్ మాట్లాడుతూ మణిరత్నం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పు కొచ్చాడు.

పోన్నియన్ సెల్వన్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా దర్శకుడు శంకర్ మాట్లాడుతూ ... పాన్ ఇండియా అనే పదం మనం ఈ రోజుల్లో వింటున్నాం. కానీ మణిరత్నం సార్ మొదటి పాన్ ఇండియా దర్శకుడు. ఆయన తీసిన రోజా మరియు బొంబాయి మూవీ లు దేశ వ్యాప్తంగా అలరించాయి. అలాగే ఆయన శైలి కి మరియు పని తీరుకు ప్రేక్షకులు  ఫిదా అయ్యారు. మణి సార్ మార్గం లోనే మేమంతా వెళ్తున్నాం అని దర్శకుడు శంకర్ , మణిరత్నం గురించి పోన్నియన్ సెల్వన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా చెప్పు కొచ్చాడు.

ఇది ఎలా ఉంటే పోన్నియన్ సెల్వన్ మూవీ లో చియాన్ విక్రమ్ , జయం రవి , కార్తీ ,  త్రిష , ఐశ్వర్య రాయ్ వంటి హేమా హేమీలు అయిన నటీ నటులు నటించారు. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ ఎలాంటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: