ఇండియా లోనే గ్రేట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మణిరత్నం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మణిరత్నం తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో గొప్ప గొప్ప సినిమాలకు దర్శకత్వం వహించి ఇండియా లోనే గ్రేట్ డైరెక్టర్ గా పేరును తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇండియాలో గ్రేట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మణిరత్నం గత కొంత కాలంగా మాత్రం బాక్సా ఫీస్ దగ్గర సరైన విజయాన్ని అందుకోవడంలో కాస్త వెనుకబడిపోయాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించాడు.

మూవీ లో చియన్ విక్రమ్ ,  కార్తీ ,  జయం రవి ,  ఐశ్వర్య రాయ్ ,  త్రిష వంటి గొప్ప గొప్ప నటీ నటులు నటించారు. ఈ మూవీ కి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కాబోతుంది.  అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పాటలను మరియు కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా , వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ ,  హిందీ భాషల్లో సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా మీడియాతో మాట్లాడిన మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మూవీ కి  సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియ జేశాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన మణిరత్నం ...  పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం విడుదల అయిన తర్వాత 6 నెలల నుండి 9 నెలల తర్వాత పొన్నియన్ సెల్వన్ రెండవ భాగం విడుదల కాబోతోంది అని తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: