తెలుగులో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్..ప్రస్తుతం ఆరో సీజన్ లో వుంది..ఇది కూడా మూడు వారాలను పూర్థీ చేసుకుంది..గత సీజన్లలో సోషల్ మీడియాలో వచ్చిన ఓట్స్ కంటే.. మరొకరు బయటకు వచ్చేసిన సంఘటనలు అనేకం. ఇప్పుడు సీజన్ 6 రసవత్తరంగా సాగుతుంది. అయితే మొదటి రోజు నుంచి ఈ సీజన్ పై పెదవి విరుస్తున్నారు ఆడియన్స్. ఎందుకంటే గేమ్ ఆడేందుకు వచ్చినవారికంటే.. ఎంజాయ్ చేసేందుకు వచ్చిన వారే ఎక్కువ. హౌస్‏లో ఒకరిద్దరు తప్ప మిగతా బ్యాచ్ మొత్తం తిన్నామా.. కూర్చున్నామా.. అన్నట్టుగా ఉన్నారు. ఇక ఇప్పటికే ఆట షూరు చేయనివారందరికీ గత వారం నాగార్జున క్లాస్ తీసుకున్న సంగతి తెలిసిందే. .


మూడోవారం ఎలిమినేషన్ ట్విస్ట్ ఎక్కువగానే జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వారం ఇనయ ఎలిమినేట్ కాబోతుందంటూ వార్త లీక్ అయిన సంగతి తెలిసిందే. ముందు నుంచి వాసంతి ఎలిమినేట్ అవుతుందనుకున్నారు. చివరి నిమిషంలో ఇనయ ఎలిమినేట్ అయ్యిందనే న్యూస్ లీక్ అయ్యింది. ఇప్పటివరకు ఇంట్లో ఉన్న అందరి అమ్మాయిలలో నేహ, ఇనయ, గీతూ మాత్రమే మొదటి నుంచి గేమ్ ఆడుతున్నారు. అందులో మూడో వారం ఇనయ కెప్టెన్సీ టాస్కులో తీవ్ర పోరాటం చేసింది.శ్రీహాన్,రేవంత్‏లతో జరిగిన మాటల యుద్ధంలో ఏమాత్రం తగ్గకుండా వాదించింది.


అంతేకాదు ఫిజికల్ టాస్కులలోనూ అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోకుండా గట్టిపోటినిచ్చింది ఇనయ. దీంతో ఆమెకు ఓటింగ్ శాతం పెరిగిపోయింది. అయితే సోషల్ మీడియా ఓటింగ్ ప్రకారం ఇనయ సేఫ్ ప్లేస్‏లోనే ఉంది. మొత్తానికి అమ్మడు సేఫ్ అయ్యిందని తెలుస్తుంది.టాస్కులలో చాలా స్ట్రాంగ్‏గా ఉంటుంది. అనవసరంగా ఎమోషనల్ కాకుండా ఒంటరిగా పోరాడుతుంది. దీంతో ఆమెను ఎలిమినేట్ చేస్తే ఇక బిగ్‏బాస్ హోస్‏లో అబ్బాయిలకు పోటీనిచ్చే అమ్మాయి కేవలం గీతూ మాత్రమే ఉంటుంది. అలాగే ఇనయ ఎలిమినేట్ అయితే బిగ్ బాస్ చూసేవారి సంఖ్య మరింత దారుణంగా పడిపోవడం పక్కా..అందుకే ఇనయ ప్లేస్ లో నేహాను బయటకు పంపించారు. నెక్స్ట్ ఎవరిని ఎలిమినేట్ చేస్తారన్నది ఆసక్తిగా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: