ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు అందంగా ఉండాలని, ఇలా తమ అందాన్ని రెట్టింపు చేసుకుంటూ ఇండస్ట్రీలో మరికొంత కాలం పాటు కొనసాగాలని భావిస్తూ నే ఉంటారు


అయితే కొంతమంది దేవుడు ఇచ్చినటువంటి సహజమైన అందంతోనే అవకాశాలను రాబట్టుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగగా మరికొందరు మాత్రం మరింత అందంగా కనిపించడం కోసం సర్జరీలు కూడా చేయించుకుంటారు. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు ఇలాంటి సర్జరీలు చేయించుకున్న సంగతి మనకు తెలిసిందే.


ఈ క్రమంలోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూజా హెగ్డే కూడా సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమయ్యారు.చూడటానికి ఎంతో చక్కగా కుందనపు బొమ్మలా ఉండే పూజా హెగ్డే లో ముక్కు తన అందాన్ని చెడగొడుతుందని చాలామంది ఆమె సన్నిహితులు కూడా తనకు సూచనలు చేశారట.ఈ క్రమంలోనే తాను మరింత అందంగా కనిపించడం కోసం పూజా హెగ్డే ముక్కు సర్జరీ చేయించుకోవాలని సిద్ధమైనట్టు తెలుస్తుంది.


 


ఈ విధంగా ముక్కుకు సర్జరీ చేయించుకొని ఈ బుట్ట బొమ్మ మరింత అందంగా కనిపించడానికి ప్రయత్నాలు చేస్తుందనే సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే పలువురు ఈమె అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ చూడటానికి ఎంతో చక్కగా ఉన్నారు అయితే మరి సర్జరీలు అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా పూజ హెగ్డే కి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.


 


ఈ సర్జరీ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఈ విషయంపై పూజా హెగ్డే స్పందించాల్సి ఉంది. పూజ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అలాగే పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ సినిమాలో కూడా పూజ హెగ్డే నటిస్తున్నారు. ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను నిలిపివేసిందట..

మరింత సమాచారం తెలుసుకోండి: