తనూశ్రీ దత్త.. ఈ పేరు గురించి ఈమె గురించి ప్రత్యేకం గా పరిచయం చేయనక్కర్లేదు. హాలీవుడ్ కే పరిమితం అయిన మీటూ ఉద్యమాన్ని ఇండియా లో మొదలు పెట్టి బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన సీనియర్ హీరోయిన్ ఈమె.
సీనియర్ నటుడు తనను షూటింగ్ సమయం లో

అత్యంత దారుణం గా శారీరకం గా వేధించాడు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి గా బాలీవుడ్ ని ఉలిక్కిపడే లా చేశాయి. ఆ తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ 10, 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలను మీడియా ముందుకు తీసుకు వచ్చి ఎంతో మంది బాలీవుడ్ స్టార్స్ యొక్క జీవితాన్ని రోడ్డున పడేసేలా చేశారు అనడంలో సందేహం లేదు.

ఆ విషయం పక్కన పెడితే మీటూ ఉద్యమం వల్ల ఇప్పుడు ఇండస్ట్రీలో కాస్త ఆడ వారిపై గౌరవము ను చూపిస్తున్నారు అనడంలో సందేహం లేదు. ఆ విషయంలో తనూశ్రీ దత్త ని మెచ్చుకోవాల్సిందే. ఇక తనూశ్రీ దత్త ఇప్పటికి కూడా అప్పటి వ్యాఖ్యల కారణంగా ఇబ్బంది పడాల్సి వస్తుందట.

ఈమెను హత్య చేసేందుకు ఇప్పుడు కూడా కొందరు కుట్ర చేశారని ఆమె ఆరోపిస్తుంది. ఆ మధ్య రెండు సార్లు కారు యొక్క బ్రేక్ ఫెయిల్ చేసి మరీ చంపాలని చూశారని.. కానీ దేవుడి దయ వల్ల తాను బతికి బయట పడ్డానని తనూశ్రీ దత్త చెప్పుకొచ్చింది.

తనను రెండు సార్లు చంపాలని చూసిన వారు మళ్లీ చంపడానికి ప్రయత్నించే అవకాశం లేకపోలేదు కనుక నా చావుకు బాలీవుడ్ లోని ఆ మాఫియా కారణం అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.

రెండు సార్లు హత్యకు కుట్ర జరిగిందని మీడియా ద్వారా ఆరోపిస్తున్న ఈమె పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంతో తనూశ్రీ దత్త ఉంటూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: