టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు. ఎంతోమంది హీరోలని స్టార్స్ గా మార్చిన ఘనత పూరి జగన్నాథ్ కే దక్కుతుంది.
కేవలం డైలాగ్ డాన్స్ కూడా రాని నటులను దగ్గరుండి డైలాగ్ చెప్పడం నేర్పించి స్టెప్స్ వేయడం నేర్పించి ఇప్పుడు బిగ్ స్టార్స్ గా సినీ ఇండస్ట్రీలో పాతుకుపోయేలా చేశాడు ఈ పూరి జగన్నాథ్. వాళ్ళల్లో మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్, రవితేజ. మనకు తెలిసిందే రవితేజకు పవన్ కళ్యాణ్ కు లైఫ్ ఇచ్చింది పూరి జగన్నాథ్ నే. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఈ హీరోల సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి.

పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన బద్రి సినిమాను తెరకెక్కించింది పూరీ జగన్నాథ్. అలాగే మాస్ మహారాజ రవితేజకు ఆ టైటిల్ వచ్చేలా చేసింది.. కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన ఇడియట్ సినిమాను తెరకెక్కించింది కూడా పూరి జగన్నాథ్ నే. మరి ఇన్ని బ్లాక్ బస్టర్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ఇప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనకు తెలిసిందే. రీసెంట్గా ఆయన తెరకెక్కించిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద చెత్త రికార్డును సొంతం చేసుకుంది. దీంతో ఎన్నడూ లేని విధంగా సొంత ఫ్యాన్స్ కూడా పూరి జగన్నాధ్ ని ట్రోల్ చేశారు. కాగా ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ ఇల్లు విడిచి ఎక్కడికి రాకుండా ఉండిపోయాడు.

అంతేకాదు ఆయన తదుపరి సినిమా జనగణమన కూడా ఆగిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సొంత కొడుకుతో డిఫరెంట్ స్టోరీని తెరకెక్కించే పనిలో బిజీ అయ్యాడట పూరి జగన్నాథ్ . ఇందుకోసమే ఇల్లు వదిలేసి ఏకంగా మూడు నెలల పాటు గోవాలో ఉండి కథను రాసుకొని మళ్లి తిరిగి వస్తాను అంటూ వెళ్లిపోయాడట పూరి జగన్నాథ్. ప్రస్తుతం ఇదే న్యూస్ టాలీవుడ్ లో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే పూరి జగన్నాథ్ ఎప్పుడు స్టోరీలు ఇంట్లో కూర్చుని రాయడు ..బీచ్ లో.. థాయిలాండ్ లో ఇలా ఆయన తన మూడ్ ని మార్చుకుంటూ కథలు రాసుకుంటాడు .ప్రజెంట్ పూరి జగన్నాథ్ గోవాలో ఉన్నట్టు సమాచారం. అంతేకాదు త్వరలోనే తన కొడుకుతో చేయబోయే సినిమాను అఫీషియల్ గా ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు సినీ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: