సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం శాకుంతలం. భారీ సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచిన గుణశేఖర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం అయన ఫామ్ లో లేకపోవడంతో ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా ను చేస్తున్నాడని చెప్పొచ్చు. చారిత్రాత్మక , పౌరాణిక గాధగా రాబోతున్న ఈ సినిమా లో దుష్యంతుడిగా దేవ్‌మోహన్‌ నటించారు. సమంత కూడా విడాకుల తర్వాత ఒప్పుకున్నా ఈ సినిమా లో మంచి పాత్ర పోషిస్తుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్‌ 4న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు గతంలో ప్రకటించారు.

దాంతో సమంత అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అన్నట్లు ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన నటి ని చూసి చాలా రోజులే అయిపోయిన నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం విడుదలను వాయిదా వేసినట్టు తెలిపారు. ఇది నిజంగా అందరిని నిరాశపరిచి విషయం అనే చెప్పాలి. అయితే గుణశేఖర్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణం లేకపోలేదట. చిత్రాన్ని త్రీడీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నామని గుణశేఖర్ చెప్పారు.

అందుకే ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతుందని అయన వెల్లడించారు.  త్రీడీ లో సినిమా ను కన్వర్ట్ చేయాలంటే కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి ముందుగా అనుకున్న సమయంలో చిత్రాన్ని విడుదల చేయలేమని చెప్పారు. ఏదేమైనా ఇది సినిమా అభిమానులను సంతృప్తి పరిచే విషయమని చెప్పాలి.  త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శకుడు గుణశేఖర్‌ తెలిపారు. ఇక ఈ సినిమా తర్వాత సమంత మరిన్ని ఆసక్తి కరమైన సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ సరసన ఈ ముద్దుగుమ్మ ఖుషి అనే సినిమాలో నటిస్తుంది. యశోద అనే మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా ఈమె చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: