మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి , మోహన్ రాజా దర్శకత్వం లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ ,  సత్య దేవ్ ,  నయన తార ఇతర కీలక పాత్రలో నటించారు.

మూవీ లో సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటించగా ,  సత్య దేవ్  ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. నయన తారమూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది. ఈ మూవీ కి తమన్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి తమన్ అందించిన పాటలలో నుండి కొన్ని పాటలను మూవీ యూనిట్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది  గాడ్ ఫాదర్ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే  గాడ్ ఫాదర్ మూవీ కి అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. గాడ్ ఫాదర్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 91 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం.  మరి గాడ్ ఫాదర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్ లను సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: