అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో వైరల్ అవుతూనే ఉంటుందట.అయితే అనసూయ తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేసిన ప్రతీ సందర్భంలో ఏదో రకమైన ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది.


ఇంట్లోనూ పొట్టి బట్టలు ధరిస్తూ ఉంటుందని ట్రోల్స్ వేస్తుంటారు. బయట ఆమె వేసే పోస్ట్ లు సైతం కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి. మొన్నటికి మొన్న విజయ్ లైగర్ రిలీజ్ సమయంలో అనసూయ వేసిన పోస్ట్ ఆంటీ కాంట్రవర్సీ ఎంతలా చర్చకు దారి తీసిందో అందరికీ గుర్తుండే ఉంటుంది.


అనసూయ ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడుతుంది. అందులో కొన్ని మాటలు కొందరికి నచ్చుతాయి. ఇంకొందరికి నచ్చవు. నచ్చని వాళ్లు ట్రోల్స్ వేస్తుంటారు. ఇక అనసూయ సైతం ట్రోలర్లకు తన స్టైల్లో జవాబు ఇస్తుంటుంది. ఇష్టమొచ్చినట్టుగా బూతులతో రెచ్చిపోయే నెటిజన్ల పని పట్టేందుకు అనసూయ రంగంలోకి దిగింది. అందరి మీద కేసులు వేస్తానంటూ.. అందరి స్క్రీన్ షాట్లు రెడీగా ఉన్నాయంటూ.. ఏ ఒక్కరినీ వదిలిపెట్టను అంటూ అనసూయ శపథం కూడా చేసింది.


అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటోంది. చేతిలో ఉండే ఒకే ఒక్క షో జబర్దస్త్ వదిలేసింది. స్టార్ మాలోని సింగింగ్ షోకు హోస్టింగ్ చేసింది. కానీ ఇప్పుడు అది కూడా ముగిసింది. దీంతో బుల్లితెరపై అనసూయకు అవకాశాలు లేకుండా పోయాయి. మరి ఇంకో కొత్త షోతో అనసూయ ముందుకు వస్తుందా? లేదా? అన్నది చూడాలి.


అయితే అనసూయ ఇప్పుడు తన భర్త గురించి చెప్పుకొచ్చిందట . సుశాంక్ భరద్వాజ్ బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీ అంతా కూడా సరదాగా అలా బయటకు వెళ్లి ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. నువ్వే నా సూపర్ మేన్ అని నీకు తెలుసు కదా? అంటూ తన భర్త గురించి చెప్పేసింది అనసూయ. ఇక తన భర్తతో కలిసి అనసూయ మంచి రొమాంటిక్ పోజులు పెట్టేసిందట..


అనసూయది లవ్ మ్యారేజ్ అన్న విషయం తెలిసిందే. ఇంట్లో పెద్ద వాళ్లు ఒప్పుకోకపోవడంతో.. బయటకు వచ్చి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత కొన్నేళ్లకు మళ్లీ ఇంట్లో వారంతా ఒప్పుకుని స్వాగతించిన సంగతి తెలిసిందే. అనసూయ ఎన్‌సీసీ టైంలోనే ఈ ప్రేమ చిగురించిన సంగతి తెలిసిందే. ఇది వరకే ఎన్నో ఇంటర్వ్యూల్లో అనసూయ తన ప్రేమ కథను చెప్పింది.


అనసూయ ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తోంది. వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోన్నట్టుగా తెలుస్తోంది. ఆ భాష ఈ భాష అన్న తేడా లేకుండా అన్ని భాషల్లోనూ నటించేందుకు అనసూయ ఆసక్తిని చూపిస్తోందట. అదే సమయంలో ప్రత్యేక పాటల్లోనూ నర్తించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోందట అనసూయ.

మరింత సమాచారం తెలుసుకోండి: