కన్నడ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి రిషబ్ శెట్టి తాజాగా కాంతారా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూ వీలో రిషబ్ శెట్టి హీరోగా నటించడం మాత్రమే కాకుండా , ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ లో రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీన కన్నడ భాషలో విడుదల అయింది. కన్నడ భాషలో ఈ మూవీ కి బ్లాక్ బాస్టర్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ ని తెలుగు భాషలో అక్టోబర్ 15 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ కి తెలుగు భాషలో కూడా బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి. ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా మరి కొద్ది రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. 

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా నిలబడింది. ఈ మూవీ "ఓ టి టి' హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. తాజాగా ఈ సంస్థ ఈ మూవీ ని కన్నడ , తెలుగు  , తమిళ , మలయాళ భాషలలో నవంబర్ 24 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులకు ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దామని మిస్ అయిన వారు ఉంటే నవంబర్ 24 వ తేదీ నుండి కన్నడ , తెలుగు , మలయాళ , తమిళ భాషలలో ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: