మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరియర్ లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇది ఇలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సంవత్సరం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు . ప్రస్తుతం రామ్ చరణ్ , శంకర్ దర్శకత్వంలో తెరకెక్కు తున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న మూవీ లలో ఆరెంజ్ మూవీ ఒకటి. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించక పోయిbనప్పటికీ ఇప్పటికీ ఈ మూవీ టీవీ లలో ప్రసారం అయినప్పుడు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది .

మూవీ లో జెనీలియా హీరోయిన్ గా నటించగా , బొమ్మలిల్లు భాస్కర్మూవీ కి దర్శకత్వం వహించాడు . నాగబాబు ఈ మూవీ ని నిర్మించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ విడుదల అయ్యి 12 సంవత్సరాలు పూర్తి అయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ని రీ రిలీజ్ చేయాలి అని ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆ క్రమంలో నాగబాబు స్పందిస్తూ ... ఎప్పటికీ రిఫ్రెష్ చేసే సంగీతం , ప్రేమ కథ కలిగిన ఆరెంజ్ మూవీ ఎంతో మంది హృదయాల్లో చోటు దక్కించుకుంది. ఫ్యాన్స్ డిమాండ్ మేరకు త్వరలోనే ఆరెంజ్ మూవీ ని రీ రిలీజ్ చేస్తాం అని నాగబాబు స్పందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: