సినీ ఇండస్ట్రీలో విలన్ పాత్రలలో ఎక్కువగా నటించి ప్రేక్షకులకు దగ్గరైన సత్య ప్రకాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా  ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమరసింహారెడ్డి మూవీ షూటింగ్ వైజాగ్ జగదాంబ సెంటర్ లో జరుగుతున్న సమయంలో నేను అక్కడే ఉన్నానని...అంతేకాదు ఒక లేడీ వెనుక మాట్లాడుతూ వీడే ఆ దరిద్రుడు అని సినిమాల్లో రే* సీన్లలో నటించే నటుడు ఇతనేనని కామెంట్ చేశారని చెప్పుకొచ్చారు.  అయితే నేను నిజంగా దొరికితే చంపేసేంత కోపం ఉందని కామెంట్లు చేసేవాళ్లని ఆయన అన్నారు.

అంతేకాదు తాము నటించిన సినిమాల్లోని పాత్రలను నిజమేనని చాలామంది భావిస్తారని సత్య ప్రకాష్ వెల్లడించారు.ఇక  అంత దరిద్రంగా యాక్టింగ్ చేశావ్ అంటూ కొంతమంది తన గురించి కామెంట్లు చేశారని ఆయన అన్నారు. ఇకపోతే పాత్రలో నేను జీవించడంతో అలా చెప్పారని సత్య ప్రకాష్ పేర్కొన్నారు. కాగా బాలకృష్ణతో పది కంటే ఎక్కువ సినిమాలు చేశానని సత్య ప్రకాష్ తెలిపారు.ఇక  బాలకృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని సత్య ప్రకాష్ పేర్కొన్నారు.అయితే  ఆ సినిమాలో పై నుంచి కిందికి దూకాల్సిన సీన్ లో చేయడానికి నేను భయపడ్డానని

 బాలకృష్ణ మాత్రం ధైర్యంగా ఆ షాట్ చేశారని ఆయన వెల్లడించారు.కాగా విజయేంద్ర వర్మ సినిమాలో బిల్డింగ్ పై నుంచి దూకే సీన్ లో బాలయ్య సునాయాసంగా చేసేశారని సత్య ప్రకాష్ అన్నారు.ఇక  ఆ సమయంలో బాలకృష్ణ కాలి నుంచి రక్తం వచ్చిందని ఆయన తెలిపారు. అయితే బాలయ్య స్థాయిలో స్ట్రాంగ్ విల్ పవర్ ఉండటం చాలా రేర్ అని సత్య ప్రకాశ్ పేర్కొన్నారు.అంతేకాదు  బాలయ్య లాంటి గ్రేట్ హీరోను నేనైతే ఇతర ఇండస్ట్రీలలో కూడా చూడలేదని ఆయన చెప్పుకొచ్చారు.అయితే సత్య ప్రకాశ్ బాలయ్య గురించి పాజిటివ్ గా కామెంట్లు చేయడంతో బాలయ్య అభిమానులు సైతం సంతోషిస్తున్నారు.కాగా బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లు కూడా సక్సెస్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: