తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో కొంత మంది హీరోలు ఇప్పటికే పాన్ ఇండియా మూవీ లలో నటించి అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును దక్కించుకున్నారు . ఇది ఇలా ఉంటే తాజాగా ఐఎండిబి సంస్థ మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ ఇన్ 2022 అనే పేరుతో ఒక లిస్ట్ ను విడుదల చేసింది.
ఆ లిస్ట్ లో మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ముగ్గురు హీరోలు ఉన్నారు. ఆ ముగ్గురు హీరోలు ఎవరు ... వారు ఏ స్థానాలలో ఉన్నారో తెలుసుకుందాం .


ఐఎండిబి సంస్థ తాజాగా విడుదల చేసిన మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ ఇన్  2022 జాబితాలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి మొదటగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిలిచాడు. ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన లిస్ట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 4 వ స్థానంలో ఉన్నాడు. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ తాజాగా ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ , శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో నటిస్తున్నాడు. రామ్ చరణ్ తర్వాతి స్థానంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఈ లిస్ట్ లో 8 వ స్థానంలో ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ఆ తరువాత అల్లు అర్జున్ 9 వ స్థానంలో ఉన్నాడు. అల్లు అర్జున్ "పుష్ప" మూవీ తో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: