బుట్ట బొమ్మ పూజ హెగ్డే నటించిన సినిమాలన్నీ ఇటీవల పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇటీవల ఈమె నటించిన రాధేశ్యాం మరియు ఆచార్య రెండు సినిమాలు కూడా  ప్లాప్ అయ్యాయి. తెలుగులోనే కాకుండా ఈమె కోలీవుడ్లో కూడా నటించింది.ఇక కోలీవుడ్లో బీస్ట్ సినిమాలో నటించిన ఈమె ఆ సినిమా కూడా పెద్దగా హిట్టును అందుకోలేకపోయింది. గతంలో వరుస హిట్ సినిమాలతో దూసుకుపోయిన ఈమె ఇప్పుడు వరుస ప్లాప్  సినిమాలను అందుకుంటుంది. ఇలా ఉంటే ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న జనగణమన సినిమా షూటింగ్ కూడా మధ్యలోనే ఆగిపోయింది.

వాటితో పాటుగా పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ సినిమాలో కూడా నటించే అవకాశాన్ని పోగొట్టుకుంది పూజ హెగ్డే.అయితే ఈ సినిమాలను మిస్ చేసుకోవడం వల్ల పూజా హెగ్డే దాదాపు 10 కోట్ల రూపాయల వరకు నష్టపోయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం పూజ  ఒక్క సినిమాకి గాను నాలుగు నుండి ఐదు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇక రెమ్యూనరేషన్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కానీ పూజా హెగ్డే వాటికి సంబంధించిన కొన్ని ఆరోపణలను కూడా ఎదుర్కొంటుంది. అయితే ఇలా తనపై వస్తున్న ఆరోపణలకు గట్టి సమాధానం ఇచ్చింది పూజ హెగ్డే.

ఇక పూజ హెగ్డే మాట్లాడుతూ నేను ఎక్కువ రెమ్యూనరేషన్ ఎప్పుడూ డిమాండ్ చేయను.. నిర్మాతలను ఇబ్బంది పెట్టను.. నా మీద వస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తవం అని చెప్పింది పూజ హెగ్డే. నాకు డబ్బు కంటే కూడా నేను నటించే పాత్రే నాకు ముఖ్యమని... పాత్ర నచ్చితే రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చినా నేను తీసుకుని ఆ పాత్రకి న్యాయం చేస్తానని చెప్పుకొచ్చింది పూజ హెగ్డే. ఒకవేళ డబ్బే  నాకు ముఖ్యం అని అనుకుంటే ప్రస్తుతం నా చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. డబ్బే కావాలి అని అనుకుంటే ఆ ప్రాజెక్టులు అన్నీ నేను ఓకే చేసేదాన్ని కానీ నేను అలా కాదు అంటూ ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చింది పూజ హెగ్డే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: