టాలీవుడ్ లో పలు స్టార్ హీరోలతో నటించి హిట్లు కొట్టి హాటెస్ట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న పూజ హెగ్డే ..ప్రస్తుతం ఎలాంటి పొజిషన్లో అల్లాడిపోతుందో అందరికీ తెలిసిందే. గత సంవత్సరం ఆమె నటించిన నాలుగు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చాలా దారుణంగా డిజాస్టర్ గా మారాయి.ఈ క్రమంలో పూజ హెగ్డే పేరు సోషల్ మీడియాలో ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేసి మరి ఆమెను ఒక రేంజిలో నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. చాలా మంది స్టార్ హీరోస్ తో జత కట్టిన పూజా హెగ్డే రాత ఇంకా మారకపోవడంతో జనాలు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.ప్రస్తుతం పూజ హెగ్డే కెరియర్ మాత్రం కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతుంది. ఎలాగైనా సరే ఆమె సల్మాన్ ఖాన్ తో చేస్తున్న హిందీ ప్రాజెక్ట్ హిట్ అయితేనే పూజ హెగ్డే పేరు మళ్లీ ఇండస్ట్రీలో వినిపించే ఛాన్స్ ఉంది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే పూజ ఇక కెరియర్ కి గుడ్ బాయ్ చెప్పేయొచ్చు అంటూ కామెంట్స్ ఇంకా ట్రోల్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక చేసేది లేక సక్సెస్ తో కళ్ళు మూసుకుపోయిన పూజా హెగ్డేకు దెబ్బకు దేవుడు కనిపించాడు.


అందుకే ఇలాంటి టైమ్ నడుస్తుండడంతో మొత్తం భారాన్ని దేవుడిపై వేసేసింది పూజా హెగ్డే .అందుకే పూజా హెగ్డే హైదరాబాద్ లోని ఫేమస్ టెంపుల్ పెద్దమ్మతల్లి గుడి కి వెళ్ళింది .ఈ హాట్ డస్కి బ్యూటీ  ఆదివారం పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించింది.అమ్మవారిని దర్శించుకున్న తరువాత కాసేపు అమ్మవారి సన్నిధిలో హల్చల్ చేసింది పూజ హెగ్డే . ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు ఇంకా అలాగే వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎప్పుడు తొడలు చూపిస్తూ హాట్ గా అందాల ప్రదర్శన చేసే పూజా హెగ్డే ఇప్పుడు కష్టం రావడంతో వైట్ కలర్ కుర్తాలో చాలా ట్రెడిషనల్ గా ఇంకా అట్రాక్టివ్ లుక్ లో దేవున్ని దర్శించుకుంది. ఇన్నాళ్లు టూర్లు తిరిగి బికినీలు వేసి స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ పబ్బులు , పార్టీలు అంటూ తెగ తిరిగిన పూజా హెగ్డే .. సడన్గా ఇలా దైవ దర్శనం చేసుకోవడం ఏంటని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: