టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టి బిజీగా ఉన్నాడు ఈయన. ఈ వయసులో కూడా ఏమాత్రం తగ్గని అందంతో దూసుకుపోతున్నాడు నాగార్జున. కొడుకుల కంటే ఎంతో గ్లామరస్ గా కనిపిస్తూ కింగ్ నాగార్జున గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.అయితే ప్రస్తుతం నాగార్జునకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటి అంటే ఆ ఒక్క విషయంలో మాజీ మామ నాగార్జున కన్నా మాది కోడలు సమంతనే బెస్ట్ అని చాలామంది నెట్వర్క్ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.

అయితే అక్కినేని నాగార్జున ఈ మధ్యకాలంలో ఎలాంటి సినిమాలు చేయడం లేదు. దీంతో అక్కినేని అభిమానులు కాస్త నిరాశపడుతున్నారు. అక్కినేని  హీరోల నుండి ఒక్క సినిమా అయినా వస్తే బాగుంటుందని  ఎదురు చూస్తున్నారు అక్కినేని అభిమానులు. ఇటీవల నాగార్జున నటించిన ది గోస్ట్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విధంగా డిజాస్టర్ గా మిగిలింది. దీంతో అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రచయిత ప్రసన్నకుమార్ తో ఒక సినిమా నాగార్జున తీస్తున్నారని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలు మాత్రం ఎప్పటి వరకు ఇవ్వలేదు.

ఇక ఈ విషయంలో అక్కినేని అభిమానులు నాగార్జునపై తీరా ఆగ్రహంతో ఉన్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే చాలామంది సమంత పేరును తెరమీదకి తీసుకొస్తూ నాగార్జున కంటే మాజీ కోడలే బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే టైటిల్ నాగార్జున పూజ హెగ్డే తో కలిసి ఒక మాజా యాడ్లో కనిపించారు.. కానీ సినిమాలకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు అంటూ రకరకాల కామెంట్లను చేస్తున్నారు అక్కినేని అభిమానులు. అంతేకాదు మీకంటే మీ మాజీ కోడలు సమంతనే వారి సినిమాలు చేస్తూ ఫుల్ జోష్లో ఉంది అని ఇప్పటికే రెండు మూడు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ తాజాగా ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్ సినిమాతో కూడా రానుంది అని దాంతో పాటు మరో నాలుగు ఐదు ప్రాజెక్టులు సమంత చేతిలో ఉన్నాయి అంటూ నాగార్జున పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: