ఇటీవల కాలంలో ఏదైనా స్టార్ హీరో సినిమా పట్టాలెక్కపోతుంది అంటే చాలు ఇక ఆ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉంటాడని అందరూ ఫిక్స్ అయిపోతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు ఇప్పటికే మ్యూజిక్ అందించి సెన్సేషన్ సృష్టించాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్గా హవా నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇలా ఎన్నో సినిమాలకు పాటలు అందించిన థమన్ తన ఫోన్ లో రింగ్ టోన్ గా ఏ హీరో పాట పెట్టుకున్నాడు అని తెలుసుకోవడానికి అభిమానులు ఇష్టపడుతూ ఉంటారు.
అయితే ఇక ఈ విషయం గురించి తెలిసి అభిమానులు అందరూ షాక్ అవుతారు అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు వందల సాంగ్స్ కంపోజ్ చేసిన తమన్ తమిళ హీరో ఇలయ దళపతి విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమాలోని ఒక మ్యూజికల్ బిజీఎమ్ ను తన ఫోన్ కి రింగ్ టోన్ గా పెట్టుకున్నాడట. నేపథ్య సంగీతాలతో వచ్చే మాస్టర్ సినిమా బిజిఎం అంటే తమన్ కి చాలా ఇష్టమట. ఈ క్రమంలోనే ఆ మ్యూజిక్ ని రింగ్ టోన్ గా పెట్టుకున్నాడట. ఈ విషయం గురించి తెలిసి తమన్ కి విజయ్ అంటే మరీ ఇంత ఇష్టమా అని షాక్ అవుతున్నారు ఫ్యాన్స్.