వెంకీ అట్లూరి దర్శకత్వంలో స్టార్ హీరో ధనుష్ , సంయుక్త మీనన్ జంటగా నటించిన సోసియో ఫాంటసీ చిత్రం సార్.. చదువుకుందాం చదువు కొనకూడదు అంటూ విద్యకు ఉన్న ప్రాధాన్యతను ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు డైరెక్టర్ .. అలాగే కార్పొరేట్ విద్యాసంస్థల అక్రమాలపై కూడా గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు ఈ సినిమా ద్వారా తెలుస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ బానర్లపై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై మొదటి షో తోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు ధనుష్ కెరియర్ లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిందని చెప్పవచ్చు.

ఇకపోతే విద్యకు ఉన్న వాల్యూ గురించి ఒక వైపు చర్చిస్తూనే.. మరొకవైపు మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి  చోటు ఇవ్వడంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.  ముఖ్యంగా చదువుకునే వాళ్ళు.. చదువు చెప్పే వాళ్ళు కూడా ఈ సినిమా కచ్చితంగా చూడాలని కామెంట్లు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి.. ఇదిలా ఉండగా తాజాగా ప్రభుత్వ పాఠశాలలలో చదివే పిల్లలకు ధనుష్ టీం శుభవార్త తెలిపింది. అదేమిటంటే సార్ సినిమాను ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పివిఆర్ తో కలిసి ఒక మంచి పని చేసినట్లు తెలుస్తోంది మరికొందరికి రీచ్ అయ్యేలా హైదరాబాదులోని పలు ప్రభుత్వ పాఠశాలలోని దాదాపు 500 మంది విద్యార్థులకు ధనుష్ సార్ సినిమాను పివిఆర్ థియేటర్స్ లో ఉచితంగా చూపించడం జరిగింది.

అంతేకాకుండా విద్యార్థులకు ఉచితంగా కూల్ డ్రింక్స్, బెలూన్స్,  పాప్ కార్న్  వంటివి చిత్ర యూనిట్ అందించారు.  అంతేకాదు సినిమా పూర్తి అయిన తర్వాత స్టూడెంట్స్ దగ్గర నుంచి సినిమా ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది.  విద్యార్థులంతా కూడా సార్ సినిమా చాలా బాగుంది అంటూ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.. ఈ క్రమంలోని సినిమా కి స్టూడెంట్స్ అంతా వచ్చి సందడి చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: